అమెరికాలో హిందూ ఆలయంపై దాడి.. ఇటుకలతో ధ్వంసం చేసిన దుండగులు
- ఒహాయోలో హిందూ ఆలయంపై ఇటుకలతో దాడి
- ఆలయ కిటికీలు ధ్వంసం.. భవనానికి నష్టం
- ఘటన సమయంలో ఆలయంలో పూజారులు, భక్తులు
- దాడిని ఖండించిన హిందూ సంస్థలు
- నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్
అమెరికాలోని ఓ హిందూ ఆలయంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఒహాయో రాష్ట్రంలోని గ్రేటర్ క్లీవ్‌ల్యాండ్ ప్రాంతంలో ఉన్న శ్రీ స్వామినారాయణ్ హిందూ టెంపుల్ వడ్తాళ్‌ధామ్‌పై శుక్రవారం మధ్యాహ్నం ఇటుకలతో దాడి చేశారు. ఆలయ భవనానికి నష్టం వాటిల్లింది. కిటికీలు ధ్వంసమయ్యాయి. ఘటన జరిగిన సమయంలో ఆలయంలో పూజారులు, కొందరు భక్తులు ఉన్నారు. అయితే ఎవరికైనా గాయాలయ్యాయా? లేదా? అన్నది స్పష్టంగా తెలియలేదు.
ఈ ఘటనపై ‘ఉత్తర అమెరికా హిందువుల సంఘం’ ఆందోళన వ్యక్తం చేసింది. రిచ్‌మండ్ హైట్స్ మేయర్ కిమ్ థామస్, నగర అధికారులు దాడిని ఖండించాలని కోరింది. నిందితుడిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
అమెరికాలోని ‘హిందూ అమెరికన్ ఫౌండేషన్’ (హెచ్‌ఏఎఫ్) కూడా ఘటనను ఖండించింది. హిందూ అమెరికన్ సమాజంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు పెరుగుతున్న సమయంలో ఈ దాడి జరగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. ఆలయంపై దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి చర్యలు తీసుకోవాలని హెచ్‌ఏఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుహాగ్ శుక్లా కోరారు.
మరో పది రోజుల్లో నవరాత్రి ఉత్సవాలతో హిందూ హెరిటేజ్ మంత్ వేడుకలకు భారతీయ-అమెరికన్ సమాజం సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అమెరికాలో హిందూ ప్రార్థనా స్థలాలపై దాడులు గతంలోనూ నమోదయ్యాయి. 2022లో న్యూయార్క్‌లోని శ్రీ తులసీ మందిర్‌లో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 2023లో కాలిఫోర్నియాలోని నెవార్క్‌లో స్వామినారాయణ్ ఆలయంపై గ్రాఫిటీ వేశారు. 2024లో న్యూయార్క్, కాలిఫోర్నియాలోని బీఏపీఎస్ ఆలయాలపైనా దాడులు జరిగినట్లు హిందూ సంస్థలు తెలిపాయి.