వరల్డ్ కప్ 2027 షెడ్యూల్.. ఈసారి సరికొత్త ఫార్మాట్‌తో క్రికెట్ ఫీస్ట్!
- 2027 క్రికెట్ ప్రపంచకప్ తేదీలను ప్రకటించిన ఐసీసీ
- అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు టోర్నమెంట్
- ఈసారి 14 జట్లతో సరికొత్త ఫార్మాట్‌లో పోటీలు
- గ్రూప్ దశ, సూపర్ 7, సెమీస్ విధానంలో కీలక మార్పులు
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ 14వ ఎడిషన్ తేదీలు ఖరారయ్యాయి. 2027లో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 2న ప్రారంభమై, నవంబర్ 21న జొహన్నెస్‌బర్గ్‌లో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈసారి టోర్నమెంట్‌ను సరికొత్త ఫార్మాట్‌లో నిర్వహిస్తుండటం విశేషం. మొత్తం 14 జట్లు పాల్గొనే ఈ ప్రపంచకప్‌లో మూడు భిన్నమైన దశలు ఉంటాయి.
టోర్నమెంట్ ఫార్మాట్ ఎలా ఉందంటే..
ఈసారి ప్రపంచకప్‌లో క్వాలిఫికేషన్ నుంచి నాకౌట్ వరకు ఆసక్తికరమైన మార్పులు చేశారు. మొత్తం 14 జట్లకు గాను ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వే నేరుగా అర్హత సాధించాయి. 2026 సెప్టెంబర్ 30 నాటికి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో ఉన్న జట్లు కూడా నేరుగా క్వాలిఫై అవుతాయి. మిగిలిన నాలుగు స్థానాల కోసం క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీ జరుగుతుంది.
ఇక్కడే అసలు మార్పు మొదలవుతుంది. క్వాలిఫయర్ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు నేరుగా గ్రూప్ స్టేజీకి వెళుతుంది. కానీ, 2, 3, 4 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య 'సూపర్ సిరీస్' నిర్వహిస్తారు. ఈ మూడు జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. ఇందులో అగ్రస్థానంలో నిలిచిన జట్టు గ్రూప్ స్టేజీకి చివరి బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది.
గ్రూప్ స్టేజ్, సూపర్ 7, నాకౌట్
సూపర్ సిరీస్ ద్వారా అర్హత సాధించిన జట్టుతో కలిపి మొత్తం 12 జట్లను రెండు గ్రూపులుగా (ఒక్కో గ్రూపులో ఆరు జట్లు) విభజిస్తారు. ప్రతి జట్టు తమ గ్రూపులోని మిగతా ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశ ముగిశాక, రెండు గ్రూపుల నుంచి టాప్-3లో నిలిచిన జట్లతో పాటు రెండు గ్రూపుల్లోనూ నాలుగో స్థానంలో నిలిచి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఒక జట్టు (మొత్తం 7 జట్లు) 'సూపర్ 7' దశకు అర్హత సాధిస్తాయి.
సూపర్ 7 దశలో గ్రూప్ స్టేజీ పాయింట్లను పరిగణనలోకి తీసుకోరు. ఈ ఏడు జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. ఈ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకుంటాయి. నవంబర్ 14 నాటికి సెమీస్ బెర్తులు ఖరారవుతాయి.
నవంబర్ 17, 18 తేదీల్లో సెమీ ఫైనల్స్ జరుగుతాయి. సూపర్ 7లో మొదటి స్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంలోని జట్టుతో, రెండు, మూడు స్థానాల్లోని జట్లు పరస్పరం తలపడతాయి. ఈ మ్యాచుల్లో గెలిచిన జట్లు నవంబర్ 21న జరిగే ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి. సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డేలను కూడా కేటాయించారు.
ఇక, టీమిండియా విషయానికొస్తే.. అక్టోబర్ 7న ఆస్ట్రేలియాతో తన ప్రపంచకప్ ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. అలాగే, విక్టోరియా ఫాల్స్ సమీపంలోని మోసి-ఓ-తున్యా స్టేడియంలో జింబాబ్వేతో భారత్ తలపడనుంది. ఈ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌తో గ్రూప్ స్టేజ్ పోటీలు ముగుస్తాయి.