అక్కడ దాడి చేస్తే గనక అణు బాంబులేస్తాం.. నాటో దేశాలకు పుతిన్ ఘాటు హెచ్చరిక
- కలినిన్‌గ్రాడ్‌పై దాడి జరిగితే అణ్వాయుధాలు ప్రయోగిస్తామన్న పుతిన్
- రష్యాపై దాడికి అన్ని రకాల ఆయుధాలతో ప్రతిస్పందిస్తామని హెచ్చరిక
- నాటోతో ఉద్రిక్తతలు పెరిగితే తీవ్ర పరిణామాలుంటాయని వ్యాఖ్య
- అణ్వాయుధ బెదిరింపులు సరికాదన్న నాటో ప్రధాన కార్యదర్శి
- ఉద్రిక్తతలు అదుపు తప్పితే వెనక్కి రాలేని పరిస్థితి వస్తుందని పుతిన్ ఆందోళన
రష్యా భూభాగమైన కలినిన్‌గ్రాడ్‌పై నేరుగా దాడి జరిగితే అణ్వాయుధాలను ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. తమ దేశంపై దాడి జరిగితే అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించే అంశాన్ని తక్షణమే పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు ఉద్రిక్తతలను మరింత పెంచితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మాస్కోలో జరిగిన వాల్డాయ్ ఫోరమ్‌లో గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యాకు యూరప్‌లోని ఏ దేశంపైనా దాడి చేసే ఉద్దేశం లేదని పుతిన్ తెలిపారు. ఐరోపా దేశాలతో శాంతియుతంగా కలిసి జీవించాలన్నదే తమ ఆకాంక్షగా పేర్కొన్నారు. అయితే రష్యా భూభాగంపై ప్రత్యక్ష దాడి జరిగితే మాత్రం తీవ్రంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా నాటో సభ్యదేశాలైన పోలండ్, లిథువేనియా మధ్య ఉన్న కలినిన్‌గ్రాడ్ ప్రాంతం తమకు వ్యూహాత్మకంగా కీలకమని పేర్కొన్నారు. ఈ ప్రాంతంపై దాడి జరిగితే అణ్వాయుధాల వినియోగం అనివార్యమయ్యే పరిస్థితి రావచ్చని హెచ్చరించారు.
నాటో సైనికంగా రష్యా కంటే రెండింతలు పెద్దదని పుతిన్ వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్, బ్రిటన్ అణ్వాయుధ సామర్థ్యంపై తమకు పూర్తి అవగాహన ఉందన్నారు. అయితే తమ వద్ద కూడా ప్రత్యర్థులపై ఆధిక్యం సాధించగల ఆయుధాలు ఉన్నాయని పేర్కొన్నారు. కలినిన్‌గ్రాడ్‌ను దిగ్బంధించేందుకు నాటో ప్రయత్నిస్తే అణ్వాయుధాలు ఉపయోగించేందుకు సిద్ధమని రష్యా దౌత్యపరమైన హెచ్చరిక పంపినట్లు నాటో వెల్లడించిన నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అణ్వాయుధ బెదిరింపులు సరికాదని నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే స్పష్టం చేశారు.
2022లో ఉక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి పశ్చిమ దేశాలతో మాస్కో సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. రష్యా తమపై విధ్వంసక చర్యలకు పాల్పడుతోందని ఐరోపా దేశాలు ఆరోపిస్తుండగా.. మాస్కో వాటిని ఖండిస్తోంది. ఇదే సమయంలో ఉద్రిక్తతలు మరింత పెరిగితే వెనక్కి తగ్గలేని పరిస్థితి తలెత్తవచ్చని పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. అణ్వాయుధాల వినియోగం ప్రపంచానికి పెను ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని, అటువంటి పరిస్థితి రాకుండా దేశాలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
ఉక్రెయిన్‌పై నల్లసముద్ర ప్రాంతంలో రష్యా దాడులను నిలిపివేసే ప్రసక్తే లేదని పుతిన్ స్పష్టం చేశారు. రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్ దాడుల వల్ల తమ స్థూల దేశీయోత్పత్తిలో ఒక శాతం మేర నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న ఐరోపా కర్మాగారాలపై తక్షణమే దాడులు చేసే ఆలోచన తమకు లేదని తెలిపారు. సరైన అజెండా ఖరారైతే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి త్రైపాక్షిక సమావేశంలో పాల్గొనేందుకు సిద్ధమని కూడా పుతిన్ ప్రకటించారు.