కుటుంబంతో నవ్వుతూ కబుర్లు.. కెప్టెన్ స్మిత్ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్
- కెప్టెన్ స్మిత్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న భారత రాయబారి
- కుటుంబ సభ్యులతో నవ్వుతూ మాట్లాడుతున్న స్మిత్
- యూఏఈ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స
- స్మిత్ ధైర్యాన్ని కొనియాడిన భారత రాయబారి
- స్మిత్‌ను నిజమైన హీరోగా అభివర్ణించిన నెతన్యాహూ
దుబాయ్-టెల్‌అవీవ్ ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని యూఏఈలో భారత రాయబారి దీపక్ మిత్తల్ తెలిపారు. ఆసుపత్రిలో స్మిత్‌ను, ఆయన కుటుంబ సభ్యులను కలిసినట్లు చెప్పారు. స్మిత్ కుటుంబంతో నవ్వుతూ మాట్లాడుతున్నారని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు.
స్మిత్‌ను ‘భరతమాత వీరపుత్రుడి’గా దీపక్ మిత్తల్ అభివర్ణించారు. ప్రాణాలను కాపాడటంతో పాటు పెను ప్రమాదాన్ని తప్పించడంలో ఆయన చూపిన ధైర్యం మానవాళికి చేసిన గొప్ప సేవగా పేర్కొన్నారు. దాడిలో గాయపడినా విమానాన్ని సురక్షితంగా నడిపించేందుకు స్మిత్ చేసిన ప్రయత్నాలను కొనియాడారు.
కుటుంబంతో సంతోషంగా..
ఆసుపత్రిలో స్మిత్‌ను కలిసినప్పుడు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారని మిత్తల్ తెలిపారు. కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. కుటుంబ సభ్యులు కూడా స్మిత్‌ను చూసి ఎంతో ఊరట పొందారని చెప్పారు. యూఏఈ అధికారుల సహకారంతో కుటుంబ సభ్యులు ఆయన్ను కలిసేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. భారత రాయబార కార్యాలయం కూడా స్మిత్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని వెల్లడించింది.
విమానంలో ఏం జరిగింది?
దుబాయ్ నుంచి టెల్‌అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కాక్‌పిట్‌లో స్మిత్‌పై సహ పైలట్ కత్తితో దాడి చేశాడు. విమానంలో 174 మంది ఉన్నారు. దాడి తర్వాత విమానం దాదాపు 14 వేల అడుగుల మేర వేగంగా కిందికి పడిపోయినట్లు నివేదికలు తెలిపాయి. స్మిత్ తీవ్రంగా గాయపడినా తన శక్తినంతా కూడగట్టుకొని కాక్‌పిట్ తలుపు తెరిచారని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది కాక్‌పిట్‌లోకి వెళ్లి సహ పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత విమానంలో ఉన్న మరో ఇద్దరు ఫ్లైదుబాయ్ పైలట్లు విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌లో అత్యవసరంగా దించారు. అక్కడ స్మిత్‌కు చికిత్స అందించారు. అనంతరం ఆయన్ను యూఏఈకి తరలించారు. ఈ ఘటనలో కో-పైలట్ ఒమన్‌కు చెందిన వ్యక్తిగా ఇజ్రాయెల్ అధికారులు గుర్తించారు. స్మిత్ ధైర్యాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కూడా ప్రశంసించారు. ఆయన్ను ‘నిజమైన హీరో’గా అభివర్ణించారు.