భారత్ నుంచి యూరప్ నేర్చుకోవాల్సినవి ఇవే.. ఫ్రెంచ్ యోగా ట్రైనర్ చెప్పిన 11 విషయాలు!
- కుటుంబ బంధాలు, సామాజిక అనుబంధాలపై రోక్సానే ప్రశంసలు
- రోజువారీ జీవితంలో ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఆకట్టుకుందని వ్యాఖ్య
- భారతీయ ఆహార వైవిధ్యం, ఆప్యాయతపై ప్రత్యేక ప్రస్తావన
- రంగురంగుల దుస్తులు, చిరునవ్వులు తనను ఆకట్టుకున్నాయన్న ట్రైనర్
- చాయ్, కబుర్లు, ప్రశాంతంగా గడపడంలోని ఆనందం గురించి వివరణ
మన దగ్గర సాధారణంగా కనిపించే కొన్ని అలవాట్లు.. విదేశీయులకు మాత్రం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తాయి. పక్కింటి వారితో కబుర్లు చెప్పడం, రోజులో ఎన్నిసార్లైనా చాయ్ తాగడం, ఆప్యాయంగా పలకరించడం.. ఇలాంటివన్నీ మన జీవితంలో భాగమే. కానీ పాశ్చాత్య దేశాల్లో వీటికి క్రమంగా దూరమవుతున్నామని అంటున్నారు ఫ్రాన్స్‌కు చెందిన యోగా శిక్షకురాలు రోక్సానే. భారత్‌లో కొంతకాలం గడిపి తిరిగి యూరప్ చేరుకున్న ఆమె.. ఇక్కడి జీవనశైలిలోని ఎన్నో మంచి విషయాలను మిస్ అవుతున్నట్లు గుర్తించారు. భారతీయుల నుంచి యూరప్ నేర్చుకోవాల్సిన 11 విషయాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పంచుకున్నారు.
1. బంధాలకు ఇచ్చే విలువ: యూరప్‌లో ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా జీవించేందుకు ప్రాధాన్యమిస్తారని, ఒక్కోసారి అది ఒంటరితనానికి దారితీస్తుందని రోక్సానే అభిప్రాయపడ్డారు. భారత్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, పొరుగువారు.. చివరికి పెద్దగా పరిచయం లేని వారు సైతం ఆప్యాయంగా పలకరించడం తనకు ఎంతో నచ్చిందన్నారు.
2. జీవితంలో భాగమైన ఆధ్యాత్మికత: భారత్‌లో ఆధ్యాత్మికతకు ప్రత్యేక సమయం కేటాయించాల్సిన అవసరం లేదని, అది రోజువారీ జీవితంలోనే భాగమైందని చెప్పారు. భక్తి భావనను ఎలాంటి సంకోచం లేకుండా వ్యక్తం చేయగలగడం తనను ఆకట్టుకుందన్నారు.
3. బయట గడిపే సమయం: ఇంటికే పరిమితం కాకుండా వీధుల్లో, ఇళ్ల ముందు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం భారతీయుల ప్రత్యేకతగా పేర్కొన్నారు. చేతిలో చాయ్ కప్పుతో చుట్టుపక్కల వారితో మాట్లాడుకుంటూ కాలక్షేపం చేయడంలోని ఆనందాన్ని వివరించారు.
4. ఆహారంలోనూ ఆప్యాయత: భారత్‌లో పలకరింపే భోజనంతో మొదలవుతుందని రోక్సానే అన్నారు. ‘ఏం చేస్తున్నావు?’ అని అడగడం కంటే ‘భోజనం చేశావా?’ అని ఆప్యాయంగా అడగడం తనకు ఎంతో నచ్చిందన్నారు.
5. రుచుల ప్రపంచం: అన్నం, పప్పు, పెరుగు, పనీర్, దోశ, కూరగాయలు, కొబ్బరి.. ఇలా భారతీయ వంటకాల్లో ఎన్నో రకాల రుచులు ఉన్నాయని చెప్పారు. భారత్‌లో ఉన్నప్పుడు తన జీర్ణక్రియ కూడా ఎంతో మెరుగ్గా ఉందని పేర్కొన్నారు.
6. ఏమీ చేయకుండా గడపడం: ఎప్పుడూ ఏదో ఒక పని చేయాలనే ఆలోచనతో ఉండే యూరోపియన్లు.. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ సమయం గడపడాన్ని మర్చిపోయారని రోక్సానే అభిప్రాయపడ్డారు.
7. రంగుల ప్రపంచం: యూరప్‌లో దుస్తుల రంగులు క్రమంగా లేత రంగులకే పరిమితమవుతున్నాయని ఆమె అన్నారు. భారత్‌లోని రంగురంగుల చీరలు, ఆభరణాలు, పూలు, గాజులు తనకు ఎంతో ఇష్టమని.. ఆ రంగులను యూరోపియన్లు కూడా తమ జీవితాల్లోకి ఆహ్వానించాలని సూచించారు.
8. చిరునవ్వుతో పలకరింపు: ఎలాంటి కారణం లేకుండానే ఆప్యాయంగా నవ్వుతూ పలకరించే భారతీయుల తీరు తనను ఆకట్టుకుందని చెప్పారు. ఆ నవ్వుల్లో కృత్రిమత్వం కనిపించదని పేర్కొన్నారు.
9. మనసులో ఉన్నది చెప్పడం: భారత్‌లో నేరుగా మాట్లాడే విధానం తనకు నచ్చిందని రోక్సానే తెలిపారు. ప్రతి మాటకు ముందు ఎన్నో మర్యాదపూర్వక పదాలు జోడించకుండా మనసులోని భావాన్ని స్పష్టంగా చెప్పడం ప్రత్యేకమన్నారు.
10. రోజులో ఎన్నిసార్లైనా చాయ్: భారతీయుల జీవితంలో చాయ్‌కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. రోజులో పలుమార్లు చాయ్ తాగుతూ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం తనకు నచ్చిన మరో అలవాటని వివరించారు.
11. పరిశుభ్రతలో నీటి ప్రాధాన్యం: యూరప్‌లో టాయిలెట్ పేపర్ వినియోగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని పేర్కొన్న రోక్సానే.. వ్యక్తిగత పరిశుభ్రతలో నీటిని ఉపయోగించే అలవాటును కూడా అక్కడి వారు అలవర్చుకోవాలని సూచించారు.
నెటిజన్ల నుంచి ప్రశంసలు
భారతీయ జీవనశైలిలోని ప్రత్యేకతలను చక్కగా వివరించారంటూ రోక్సానే వీడియోపై పలువురు నెటిజన్లు స్పందించారు. ముఖ్యంగా దుస్తుల్లో రంగులకు ప్రాధాన్యం ఇవ్వడం, ఏమీ చేయకుండా కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం వంటి అంశాలు తమకెంతో నచ్చాయని పేర్కొన్నారు. భారత్‌లో విదేశీయులుగా నివసించిన కొందరు.. ఇక్కడి జీవనశైలి తమ ఆలోచనా విధానాన్ని మార్చిందని వ్యాఖ్యానించారు. ప్రతి దేశానికీ కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయని.. ఇతర దేశాల్లోని మంచి అలవాట్లను స్వీకరించడంలో తప్పులేదని మరికొందరు అభిప్రాయపడ్డారు.
రోక్సానే ఫ్రాన్స్, కెనడాల్లో యోగా శిక్షకురాలిగా పనిచేశారు. యోగా సాధన ఆమెను భారత్‌కు తీసుకొచ్చింది. ఇక్కడ యోగా శిక్షణలో ధ్రువీకరణ పొందడంతో పాటు, ప్రాచీన భారతీయ యుద్ధకళ కలరిపయట్టును కూడా అభ్యసించారు.