రాయలసీమ రైజింగ్: దేశంలోనే తొలి 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్'కు నేడు అంకురార్పణ
- రాయలసీమలో లక్ష కోట్ల రూపాయల గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శ్రీకారం
- మదనపల్లెలో జీహెచ్‌హెచ్‌కు శంకుస్థాపన చేయనున్న నిర్మల, చంద్రబాబు, పవన్
- రిలయన్స్ భాగస్వామ్యంతో దేశంలోనే 'తొలి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్' ఏర్పాటు
- రైతులకు ఆధునిక టెక్నాలజీ అందించడమే లక్ష్యంగా ISA రూపకల్పన
- ఈ కార్యక్రమానికి హాజరు కానున్న రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ
రాయలసీమ సమగ్ర అభివృద్ధిలో ఒక చారిత్రక ఘట్టానికి నేడు తెరలేవనుంది. దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన సీమ ముఖచిత్రాన్ని మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రెండు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. సుమారు రూ.1 లక్ష కోట్ల బృహత్ ప్రణాళికతో రూపుదిద్దుకుంటున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (జీహెచ్‌హెచ్), దేశంలోనే తొలి 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్' (ఐఎస్ఏ)లకు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నేడు అంకురార్పణ జరగనుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ చారిత్రాత్మక కార్యక్రమాల్లో పాల్గొని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
రైతుకు అండగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్
రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లోని ఉద్యాన రైతుల తలరాత మార్చే లక్ష్యంతో ప్రభుత్వం గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ను ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. 'విత్తనం నుంచి ఎగుమతి వరకు' (సీడ్ టు షిప్‌మెంట్) అనే నినాదంతో ఈ హబ్ పనిచేయనుంది. మొత్తం రూ.1 లక్ష కోట్ల ప్రణాళికలో భాగంగా, ప్రభుత్వం తన వాటాగా రూ.40,352 కోట్లు ఖర్చు చేయనుండగా, ప్రైవేట్ రంగం నుంచి రూ.60,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రాజెక్టు కోసం గత ఆరు నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ, ఉద్యాన, ఆర్థిక, నీటిపారుదల శాఖలతో సమీక్షలు జరిపి, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. రాయలసీమ పరిస్థితులను అర్థం చేసుకున్న కేంద్రం, ఈ హబ్‌కు నిధులు సమకూర్చేందుకు అంగీకారం తెలిపింది.
ఈ హబ్‌లో భాగంగా ఉద్యాన సాగు విస్తరణ, దిగుబడి పెంపు, కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతుల ప్రోత్సాహం వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే పండ్ల ఎగుమతి, ఫుడ్ క్లస్టర్ల ఏర్పాటుపై యూఏఈతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
వ్యవసాయానికి కొత్త దిశ.. 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్'
'రాయలసీమ రైజింగ్'లో భాగంగా ఇదే వేదికపై మరో కీలక ప్రాజెక్టుకు పునాది పడుతోంది. పారిశ్రామిక రంగానికి 'ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్' (ఐఎస్బీ) ఎలాగో, వ్యవసాయ రంగానికి అదే స్థాయిలో నైపుణ్యం, మార్గనిర్దేశం అందించేలా 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్' (ఐఎస్ఏ)ను ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోనే ఇది తొలి అగ్రికల్చర్ స్కూల్ కావడం విశేషం.
సీఎం చంద్రబాబు సూచనలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ సంస్థ ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను స్వీకరించింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ప్రత్యేకంగా హాజరవుతున్నారు.
ఈ అగ్రికల్చర్ స్కూల్ ద్వారా రైతులకు ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ అధ్యయనం, డిజిటల్ అగ్రికల్చర్, ప్రెసిషన్ ఫార్మింగ్, స్మార్ట్ ఇరిగేషన్, మార్కెట్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై శిక్షణ, సలహాలు అందిస్తారు. డిమాండ్ ఆధారిత పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించడంతో పాటు వ్యవసాయ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఇంక్యుబేషన్ కేంద్రాలను కూడా ఐఎస్ఏ అభివృద్ధి చేస్తుంది.
ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ స్వరూపమే మారిపోతుందని, వ్యవసాయ, ఉద్యాన రంగాలు లాభసాటిగా మారి రైతులకు సుస్థిర ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ కార్యక్రమాలకు మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.