ప్రయాణం రద్దయిందా? మీ రైలు టికెట్‌ను మరొకరికి బదిలీ చేయొచ్చు తెలుసా..!
- కన్ఫర్మ్ అయిన రైలు టికెట్‌ను ఇతరులకు బదిలీ చేసే అవకాశం
- కుటుంబ సభ్యులకు సులువుగా టికెట్ బదిలీ
- విద్యార్థులు, వివాహ బృందాలకూ వర్తించే సదుపాయం
- ఒక్కసారి మాత్రమే పేరు మార్పునకు అనుమతి
- ఆఫ్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలన్న రైల్వే శాఖ
అత్యవసర కారణాల రీత్యా ప్రయాణాలు రద్దయినప్పుడు, కన్ఫర్మ్ అయిన రైలు టికెట్‌లను క్యాన్సిల్ చేసుకోవడం ప్రయాణికులకు ఆర్థికంగా భారంగా మారుతుంటుంది. ముఖ్యంగా ఛార్జీల రూపంలో కొంత మొత్తాన్ని నష్టపోవాల్సి వస్తుంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు భారతీయ రైల్వే ఒక కీలక వెసులుబాటును కల్పించింది. నిర్ణీత నిబంధనలకు లోబడి, కన్ఫర్మ్ అయిన రిజర్వ్డ్ టికెట్‌ను వేరొకరి పేరు మీదకు బదిలీ చేసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ అందిస్తోంది.
ఈ సదుపాయం ప్రధానంగా కుటుంబ సభ్యులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, కుమారుడు, కుమార్తె, భార్య లేదా భర్త వంటి రక్త సంబంధీకులకు మాత్రమే టికెట్‌ను బదిలీ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు సమీపంలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌లో రాతపూర్వక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. ఒరిజనల్ టికెట్‌తో పాటు, ఎవరి పేరు మీదకు టికెట్ బదిలీ చేస్తున్నారో వారి గుర్తింపు కార్డు ప్రతిని తప్పనిసరిగా సమర్పించాలి.
కుటుంబ సభ్యులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు, వివాహ వేడుకలకు వెళ్లే బృందాలు, ఎన్‌సీసీ క్యాడెట్లు, అధికారిక విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ బదిలీ అవకాశం అందుబాటులో ఉంది. విద్యార్థులు, వివాహ బృందాల ప్రయాణానికి 48 గంటల ముందుగా, ఎన్‌సీసీ క్యాడెట్లు ప్రభుత్వ ఉద్యోగులు 24 గంటల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. అయితే, బృందాల విషయంలో గరిష్ఠంగా 10 శాతం మంది సభ్యులకు మాత్రమే ఈ మార్పునకు అనుమతి ఉంటుంది.
ప్రయాణికులు గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, ఒక టికెట్‌పై పేరు మార్పు సదుపాయం కేవలం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఈ ప్రక్రియను నేరుగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్లకు వెళ్లి ఆఫ్‌లైన్ పద్ధతిలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఈ సదుపాయం పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు. కావున, ప్రయాణికులు నిర్ణీత గడువులోగా అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో రైల్వే కార్యాలయాన్ని సంప్రదించడం శ్రేయస్కరం.