పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో రక్తపాతం.. ఐక్యరాజ్యసమితిలో కశ్మీరీ మహిళ ఘాటు విమర్శ

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో రక్తపాతం.. ఐక్యరాజ్యసమితిలో కశ్మీరీ మహిళ ఘాటు విమర్శ

Tasleema Akhtar exposes Pakistan atrocities in PoK at UN Geneva meet
  • పీఓకేలో జరుగుతున్న దారుణాలను ఐరాసలో నిలదీసిన బారాముల్లా యువతి తస్లీమా
  • పాక్ భద్రతా బలగాలు క్రూరమైన అణచివేతకు పాల్పడుతున్నాయని ఆరోపణ
  • పాక్ దళాలు జరుపుతున్న హత్యలను వెంటనే ఆపాలని డిమాండ్
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై బారాముల్లాకు చెందిన యువ కార్యకర్త తస్లీమా అఖ్తర్ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో నిలదీశారు. జెనీవాలో జరుగుతున్న 63వ సమావేశంలో ఆమె మాట్లాడారు. పీఓకేలో పాలన, ఆర్థిక సమస్యలపై జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ, పౌర సమాజ సంస్థల నేతృత్వంలో శాంతియుత నిరసనలు జరుగుతున్నాయని... వాటిపై పాక్ భద్రతా దళాలు క్రూరమైన అణచివేతకు పాల్పడుతున్నాయని తస్లీమా అఖ్తర్ ఆరోపించారు. 

వందలాది మంది కార్యకర్తలను అరెస్టు చేయడం, నాయకులను నిర్బంధించడం, ఇంటర్నెట్ నిలిపివేయడం, హింసాత్మక ఘర్షణల్లో డజన్ల కొద్దీ మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని ఆమె చెప్పారు. 

“పీఓకేలో పౌర స్వేచ్ఛ లేదు. నిరపరాధులపై పాక్ దళాలు జరుపుతున్న హత్యలను వెంటనే ఆపాలి. ప్రతి హత్యకు స్వతంత్ర విచారణ జరపాలి. సమాచారం, కమ్యూనికేషన్‌లను పునరుద్ధరించాలి” అని ఆమె డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆఫ్ టెర్రర్ విక్టిమ్స్ ఇన్ కశ్మీర్ (ఏటీవీకే)కి చెందిన ఈ కార్యకర్త, జమ్మూకశ్మీర్‌లో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, స్మార్ట్ సిటీలు, గ్రామీణ మౌలిక సదుపాయాల ద్వారా అభివృద్ధి జరుగుతోందని ప్రశంసించారు.
Advertisement
Tasleema Akhtar
PoK Human Rights
UNHRC Geneva
Pakistan Occupied Kashmir
Joint Awami Action Committee
Kashmir Activist

More Telugu News