హిట్ ఖాయం .. రాసిపెట్టుకోమంటున్న నానీ ఫ్యాన్స్!

హిట్ ఖాయం .. రాసిపెట్టుకోమంటున్న నానీ ఫ్యాన్స్!

The Paradise Movie Update
  • 'దసరా'తో నానీకి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలా 
  • ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోగా రూపొందిన 'ది ప్యారడైజ్'
  • భారీ స్థాయిలో రేపు విడుదలవుతున్న సినిమా
  • నాని సరసన మెరవనున్న కయాదు లోహర్
  • స్పెషల్ సాంగ్ లో సందడి చేసిన కీర్తి సురేశ్

నానీ నటన చాలా సహజంగా ఉంటుంది. ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతూ ఉంటాయి. అందువలన ఆయనను అంతా మన పక్కింటి అబ్బాయి .. మన కాలనీ కుర్రోడు అని అనుకుంటూ ఉంటారు. అలాంటి నాని తన ఇమేజ్ కి పూర్తి భిన్నమైన కంటెంట్ ను ఎంచుకున్నాడు. తాను ఇంతవరకూ చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకున్నాడు. అలా ఆయన చేసిన ఆ సినిమా పేరే 'ది ప్యారడైజ్'. రేపే థియేటర్లలోకి ఈ సినిమా దిగిపోతోంది. 

గతంలో తనకి 'దసరా' సినిమాతో భారీ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో నాని ఈ సినిమా చేశాడు. 'ది ప్యారడైజ్' సినిమాకి సంబంధించి అందరిలో ఆసక్తిని రేకెత్తించిన విషయం నాని లుక్. రెండు జడల వేసుకున్న నానీ లుక్ .. ఆయన బాడీ లాంగ్వేజ్ ఈ సినిమా పట్ల అభిమానులకు గల కుతూ హలాన్ని పెంచుతూ వెళుతున్నాయి. ఇక నాని కెరియర్లో ఈ స్థాయి బడ్జెట్ లో నిర్మితమైన సినిమా ఇదేనని చెబుతున్నారు. ఆ భారీతనం కనిపిస్తూనే ఉంది. 

ఈ సినిమాలో తొలిసారిగా కయాదు లోహర్ నాని జోడీ కట్టింది. ఇక 'దసరా' సినిమాలో నానీతో కలిసి ఆడిపాడిన కీర్తి సురేష్, ఈ సినిమాలో నానితో కలిసి స్పెషల్ సాంగ్ చేసింది. ఇక పవర్ఫుల్ విలన్ గా మోహన్ బాబు నటించడం ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరగడానికి కారణమైంది. అనిరుధ్ అందించిన బాణీలలో ఇప్పటికే రెండు పాటలు ఒక ఊపు ఊపేస్తున్నాయి. రేపు విడుదలవుతున్న ఈ సినిమా, వసూళ్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. నానీ మరో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Advertisement
Nani
The Paradise movie
Srikanth Odela
Mohan Babu
Anirudh Ravichander
Keerthy Suresh

More Telugu News