ఆ థియేటర్‌లో సినిమా చూస్తా.. అనుమతివ్వండి: సీఎం రేవంత్ రెడ్డికి హీరో నాని విజ్ఞప్తి
- ప్రేక్షకులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతి కోరిన నాని
- సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా విజ్ఞప్తి
- ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్‌లో షో చూడాలని ఉందని వెల్లడి
- సెప్టెంబర్ 24న నాని 'ది ప్యారడైజ్' చిత్రం విడుదల
ప్రముఖ నటుడు నాని తన తదుపరి చిత్రం 'ది ప్యారడైజ్' ప్రీమియర్ షోను ప్రేక్షకులతో కలిసి వీక్షించేందుకు అనుమతినివ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు ఆయన సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల ఒక థియేటర్‌లో అభిమానులతో కలిసి ఈ చిత్రాన్ని చూడాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ అభ్యర్థనపై నాని 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ, "ప్రేక్షకుల కోసం తీసిన సినిమాను వారితో కలిసే ఆస్వాదించాలనుకుంటున్నాను. వారి ప్రతిస్పందనలను ప్రత్యక్షంగా చూడటం నటుడిగా నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సినిమా చూడటం ఒక ప్రత్యేకమైన అనుభవం" అని పేర్కొన్నారు. ఈ ప్రదర్శన సందర్భంగా ప్రభుత్వం సూచించిన అన్ని నిబంధనలను, భద్రతా ప్రమాణాలను పాటిస్తామని హామీ ఇస్తూ, తన విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించాలని ఆయన కోరారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని కథనాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్' ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. దీనికి ఒక రోజు ముందుగా, అంటే సెప్టెంబర్ 23న ప్రత్యేక ప్రీమియర్ ప్రదర్శనను ప్లాన్ చేశారు. కాగా, ఈ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటికే అనుమతి మంజూరు చేయడం గమనార్హం.