ఆయుష్మాన్ భారత్.. ఎనిమిదేళ్లలో కుటుంబాలకు రూ. 2 లక్షల కోట్ల ఆదా
- ఆయుష్మాన్ భారత్ పథకానికి ఎనిమిదేళ్లు పూర్తి
- 60 కోట్ల మందికి రూ. 5 లక్షల వార్షిక ఆరోగ్య రక్షణ
- దేశవ్యాప్తంగా 1.86 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ల ఏర్పాటు
- ఈ నెట్‌వర్క్‌లో 38,000కు పైగా ఆసుపత్రులు భాగం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం విజయవంతంగా ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం స్పందిస్తూ.. ప్రతి భారతీయుడికి నాణ్యమైన, అందుబాటు ధరలో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ఈ పథకం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంగా నిలిచిందని ఆయన కొనియాడారు.
ఈ విషయంపై ప్రధాని మోదీ సోషల్ మీడియా 'ఎక్స్'లో ఒక పోస్ట్ చేశారు. "ఎనిమిదేళ్ల క్రితం, ప్రతి భారతీయుడికి అత్యుత్తమ, అందుబాటు ధరలో వైద్యం అందాలనే ఆలోచనతో ఆయుష్మాన్ భారత్ ప్రారంభమైంది. ఈ రోజు, 60 కోట్లకు పైగా లబ్ధిదారులకు ఏటా రూ. 5 లక్షల ఆరోగ్య కవరేజీ అందుబాటులో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం" అని ఆయన పేర్కొన్నారు.
ఈ పథకం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య ఖర్చులు రికార్డు స్థాయిలో ఆదా అవుతున్నాయని ప్రధాని తెలిపారు. అంతేగాక ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ల ద్వారా వైద్య సేవలు ప్రజల ముంగిటకే చేరుతున్నాయని, ఇప్పటికే ఈ కేంద్రాల్లో 500 కోట్లకు పైగా సందర్శనలు నమోదయ్యాయని ప్రధాని వివరించారు. ఈ పథకం ద్వారా గ్రామీణ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ బలపడుతోందని ఆయన అన్నారు.
విజయాలను వివరించిన MyGovIndia
ఆయుష్మాన్ భారత్ ఎనిమిదేళ్ల ప్రస్థానంలో సాధించిన విజయాలను MyGovIndia కూడా తన పోస్టులో వివరించింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) కింద అందించిన ఉచిత చికిత్సల వల్ల కుటుంబాలకు రూ. 2 లక్షల కోట్లకు పైగా వైద్య ఖర్చులు ఆదా అయ్యాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 38,000కు పైగా ఆసుపత్రులు ఈ నెట్‌వర్క్‌లో భాగమయ్యాయని, ఇప్పటివరకు 13 కోట్లకు పైగా హాస్పిటల్ అడ్మిషన్లు జరిగాయని పేర్కొంది.
70 ఏళ్లు పైబడిన ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లను వారి సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చారు. మొత్తం ఆయుష్మాన్ కార్డుల్లో దాదాపు సగం మహిళల పేరు మీద ఉండటం గమనార్హం.
ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు దేశవ్యాప్తంగా 1.86 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా మధుమేహం, రక్తపోటు కోసం 42 కోట్లకు పైగా స్క్రీనింగ్‌లు, అలాగే నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ల కోసం కోట్ల సంఖ్యలో పరీక్షలు నిర్వహించారు.
ఈ పథకం పోర్టబిలిటీ సదుపాయం ద్వారా లబ్ధిదారులు తమ సొంత రాష్ట్రం వెలుపల కూడా రూ. 8,800 కోట్లకు పైగా విలువైన 30 లక్షలకు పైగా చికిత్సలు పొందారని MyGovIndia వెల్లడించింది. మొత్తంగా, 60 కోట్ల మందికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా అందిస్తూ, తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఈ పథకం ఆర్థిక భద్రతను కల్పిస్తోంది.