ఐఐటీ బాంబే విద్యార్థి మృతి కేసులో కీలక పరిణామం.. సెలవుపై వెళ్లిన ప్రొఫెసర్
- సాహిల్ వాకోడే మృతి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
- దూళ్ళపై పలు ఆరోపణలతో కేసు నమోదు
- కుల వివక్ష ఆరోపణలు చేసిన సాహిల్ కుటుంబం
- సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్న క్రైమ్ బ్రాంచ్
- ఆరోపణలపై దర్యాప్తులో కొనసాగుతోందన్న అధికారులు
ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే మృతి కేసులో ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్ళను సెలవుపై పంపించారు. విద్యార్థి మృతిపై కొనసాగుతున్న దర్యాప్తు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలతో పాటు కుల వివక్షకు సంబంధించిన ఆరోపణలతో దూల్లాపై కేసు నమోదైంది.
ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో రెండో సంవత్సరం బీటెక్ చదువుతున్న సాహిల్ వాకోడే సెప్టెంబర్ 18న పోవై క్యాంపస్‌లోని తన హాస్టల్ గదిలో సీలింగుకి వేలాడుతూ కనిపించిన విషయం తెలిసిందే. అంతకుముందు మధ్యంతర పరీక్షలో మొబైల్ ఫోన్ వాడుతున్నాడని గుర్తించి అతడిని పరీక్ష హాల్ నుంచి బయటకు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ సమయంలో దూళ్ళ ఇన్విజిలేటర్‌గా ఉన్నారు. పరీక్షకు సంబంధించిన ఘటనపై సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా క్రైమ్ బ్రాంచ్ పరిశీలిస్తోంది.
వాకోడేను మొబైల్‌తో పట్టుకున్న తర్వాత ఏం జరిగిందన్న అంశంపైనా పోలీసులు దృష్టి పెట్టారు. అయితే పరీక్షలో ఏం జరిగిందన్న పూర్తి వివరాలు ఇంకా దర్యాప్తులోనే ఉన్నాయి. తొలుత ఫోన్ ద్వారా ఏఐ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించాడన్న సమాచారం వెలువడినా.. ఈ అంశంపై ఐఐటీ బాంబే తర్వాత పూర్తి వివరాలు వెల్లడించలేదు.
మరోవైపు తన కుమారుడు కులం పేరుతో అవమానాలు, వేధింపులు ఎదుర్కొన్నాడని సాహిల్ తల్లి సోనాలి వాకోడే ఆరోపించారు. దూల్లా పేరు కూడా తన కుమారుడు ప్రస్తావించాడని ఆమె తెలిపారు. ఈ ఆరోపణలను దర్యాప్తులో నిర్ధారించాల్సి ఉంది. ముంబయి క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే సాహిల్ తల్లిదండ్రులను ప్రశ్నించింది. దూల్లా వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
దూల్లాను ఇప్పటికే డీన్ (అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్) బాధ్యతల నుంచి తప్పించారు. తాజాగా సెలవుపై పంపడంతో కేసులో మరో కీలక పరిణామంగా మారింది. ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలన్న విద్యార్థుల డిమాండ్ల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. అదే సమయంలో దూళ్ళపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని కొందరు విద్యార్థులు, ఐఐటీ అధ్యాపక సంఘాలు కోరుతున్నాయి.