జైపూర్ మెర్సిడెస్ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన లగ్జరీ కార్లు
- సుమారు 8 లగ్జరీ కార్లు, ఖరీదైన విడిభాగాలు దగ్ధం
- 10 ఫైరింజన్లతో రెండు గంటల పాటు శ్రమించి మంటల ఆర్పివేత
- ప్రాణనష్టం జరగలేదని, అనేక కార్లను కాపాడామని వెల్లడి
- షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సంగనేర్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ మార్కెట్‌లో ఉన్న ఓ మెర్సిడెస్ వర్క్‌షాప్‌లో నిన్న రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో సుమారు 8 లగ్జరీ కార్లు, ఖరీదైన విడిభాగాలు, ఇతర యాక్సెసరీలు కాలి బూడిదయ్యాయి. ప్రమాద తీవ్రతకు దట్టమైన పొగలు దాదాపు 5 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 10 ఫైరింజన్లు రంగంలోకి దిగి, రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాదం జరిగినప్పుడు వర్క్‌షాప్‌లో కొత్తవి, పాతవి కలిపి 50కి పైగా కార్లు ఉన్నాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో సుమారు 8 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
అయితే, పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మిగిలిన కార్లను సురక్షితంగా బయటకు తరలించడంతో పెను నష్టం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
ప్రాథమిక విచారణ ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే, ప్రమాదానికి కచ్చితమైన కారణం తేలాల్సి ఉందని, దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. కాలిపోయిన వాహనాలు, విడిభాగాల వల్ల జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇదే రోజు జైపూర్‌లోని నారాయణ్ సింగ్ సర్కిల్ సమీపంలో ఉన్న ఓ మాల్‌లో కూడా మధ్యాహ్నం 2 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైరింజన్లు అక్కడకు చేరుకొని అరగంటలోనే మంటలను ఆర్పివేశాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.