‘ఇరాన్‌ను నాశనం చేసేయాలా?’.. ఐరాస వేదికగా ట్రంప్ సంచలన హెచ్చరిక
- ఐరాస వేదికగా ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక
- ఒప్పందం లేకుంటే నాశనం చేస్తామంటూ వ్యాఖ్య
- ఎన్నికల తర్వాత డీల్ కుదురుతుందని అంచనా
- ఇరాన్‌ను ఆర్థికంగా ఒంటరి చేయాలని పిలుపు
- రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపైనా కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. తమతో ఒప్పందానికి రాకపోతే ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేసే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మంగళవారం ప్రసంగించిన ట్రంప్.. ఇరాన్‌కు రెండు మార్గాలే ఉన్నాయని అన్నారు. అమెరికాతో ఒప్పందం చేసుకుని దేశాన్ని తిరిగి నిర్మించుకోవడం లేదా మరిన్న సైనిక చర్యలను ఎదుర్కోవడమని పేర్కొన్నారు.
‘‘నేను ఇస్లామిక్ రిపబ్లిక్‌ను త్వరగా నాశనం చేయాలా? వారికి మళ్లీ ప్రాణాలతో బయటపడే అవకాశం లేకుండా చేయాలా?’’ అని ట్రంప్ ప్రశ్నించారు. అయితే అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్ కూడా అమెరికా ఎన్నికల ఫలితాల కోసం వేచి చూస్తోందని చెప్పారు.
ఇరాన్‌కు అణ్వాయుధం దక్కకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ వాణిజ్య నౌకలపై దాడులు ఆపే వరకు, అణు కార్యక్రమాన్ని విడిచిపెట్టే వరకు, ఉగ్రవాదానికి మద్దతు నిలిపే వరకు ఆ దేశాన్ని పూర్తిగా ఆర్థికంగా ఒంటరిగా చేయాలని ఇతర దేశాలను కోరారు.
ఇరాన్‌తో జరిగిన ఘర్షణల్లో తమ సైనిక చర్యలు ఆ దేశ నౌకాదళం, వైమానిక దళం, రాడార్ వ్యవస్థలు, క్షిపణులు, డ్రోన్ల తయారీ సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే అమెరికా వద్ద ఆయుధాల కొరత లేదని చెప్పారు. కొత్తగా 18 ఆయుధాల తయారీ కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు.
గాజా యుద్ధంపైనా ట్రంప్ మాట్లాడారు. యుద్ధాన్ని ముగించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని, బందీల విడుదలకు కృషి చేసిందని చెప్పారు. తన 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికకు ఐరాస భద్రతా మండలి మద్దతు తెలిపిందని పేర్కొన్నారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంపైనా ట్రంప్ స్పందించారు. ఇరు దేశాల నేతలతో అమెరికా సన్నిహితంగా చర్చలు జరుపుతోందని.. ఈ యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపైనా విమర్శలు చేసిన ట్రంప్.. కృత్రిమ మేధ నియంత్రణకు సంబంధించిన అంతర్జాతీయ ప్రయత్నాలను కూడా వ్యతిరేకించారు.