‘తమ్ముడు శ్రీరామ్‌కు మొదట పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది నేనే’.. మంత్రి లోకేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

‘తమ్ముడు శ్రీరామ్‌కు మొదట పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది నేనే’.. మంత్రి లోకేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Nara Lokesh says I was the first to wish brother Sriram happy birthday
  • ఉదయం లేవగానే మొదటి మెసేజ్‌ పెట్టానని వెల్లడి
  • రాప్తాడు సభలో ఆసక్తికర వ్యాఖ్యలు
  • ఎన్టీఆర్‌, పరిటాల విగ్రహాల ఆవిష్కరణపై ప్రస్తావన
  • అవకాశం కల్పించిన సునీతకు కృతజ్ఞతలు
  • శ్రీరామ్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటానన్న లోకేశ్‌
రాప్తాడులో మంగళవారం జరిగిన సభలో మంత్రి నారా లోకేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిటాల శ్రీరామ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోయానని కొందరు తనతో అన్నారని.. అయితే ఉదయం లేవగానే మొదటి మెసేజ్‌ శ్రీరామ్‌కే పెట్టానని తెలిపారు.

‘‘ఉదయం లేవగానే నా తమ్ముడు శ్రీరామ్‌కు మొదటి మెసేజ్‌ పెట్టాను. ఆయనకు బర్త్‌డే విషెస్‌ చెప్పడం మర్చిపోయానని కొందరు నాతో అన్నారు. కానీ నేను ఉదయాన్నే మెసేజ్‌ పెట్టిన విషయం వారికి తెలియదు’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌, పరిటాల రవీంద్ర విగ్రహాలను ఆవిష్కరించే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ అవకాశం కల్పించిన పరిటాల సునీతకు కృతజ్ఞతలు తెలిపారు.

తన వెంట నడిచిన తమ్ముడు శ్రీరామ్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని లోకేశ్‌ అన్నారు. ధర్మవరంలో కార్యకర్తలు తనపై చూపిన అభిమానానికి గుర్తుగా చేతిపై గాట్లు ఉన్నాయని చెప్పారు.

‘‘ధర్మవరంలో మా కార్యకర్తలు నాపై చూపిన ప్రేమ.. నా చేతిపై గాట్ల రూపంలో ఉంది. రాప్తాడులో మా కార్యకర్తలు అలాంటి పరిస్థితి లేకుండా స్వాగతం పలికారు’’ అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.
Advertisement
Nara Lokesh
Paritala Sriram
Raptadu Meeting
Paritala Ravindra Statue
Nara Lokesh Speech
TDP Leaders

More Telugu News