2026 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌లో ఉంటా.. జైలుకెళ్లేందుకు సిద్ధం: షేక్ హసీనా
- ఉరిశిక్ష రాజకీయ ప్రేరేపితమని, జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని స్పష్టం
- అవామీ లీగ్ పార్టీని పునర్నిర్మించి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే లక్ష్యం
- బంగ్లాలో ఉగ్రవాదం ముప్పు తీవ్రంగా ఉందన్న మాజీ ప్రధాని
- తిరిగి వచ్చే విషయంపై ప్రభుత్వాలతో చర్చలు జరపలేదని వెల్లడి
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా కీలక ప్రకటన చేశారు. 2026 డిసెంబర్ నాటికి తాను తప్పకుండా స్వదేశానికి తిరిగి వెళ్తానని ఆమె స్పష్టం చేశారు. తాను ఎప్పుడు వెళతాననే దానికంటే, ఏ విధంగా వెళతాననేదే అత్యంత ప్రధానమని ఆమె వ్యాఖ్యానించారు. ఒక ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హసీనా ఈ విషయాలను వెల్లడించారు. తన పునరాగమనం శాంతియుత మార్గంలో, చట్టబద్ధంగానే ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
2025 నవంబర్‌లో బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ తనకు మరణశిక్ష విధించడాన్ని హసీనా తీవ్రంగా ఖండించారు. అది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, అన్యాయమైన తీర్పు అని ఆమె ఆరోపించారు. తన నిష్క్రమణ అనంతరం కొలువుదీరిన ప్రస్తుత ప్రభుత్వాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా, తనపై జరుగుతున్న విచారణను ఒక ప్రహసనంగా ఆమె అభివర్ణించారు. తన రాజకీయ పోరాటంలో భాగంగా జైలుకు వెళ్లేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఆమె తేల్చిచెప్పారు.
ప్రస్తుతం రాజకీయ కార్యకలాపాలపై నిషేధం ఎదుర్కొంటున్న తన 'అవామీ లీగ్' పార్టీని పునర్నిర్మించడం, పార్టీ శ్రేణులతో సంబంధాలను తిరిగి బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారిస్తానని హసీనా వివరించారు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద, తీవ్రవాద శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని, ఇది కేవలం ఆ దేశ అంతర్గత సమస్య మాత్రమే కాదని, ఒక తీవ్రమైన ప్రాంతీయ ముప్పు అని ఆమె హెచ్చరించారు.
అయితే, తన పునరాగమన ప్రణాళికలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ఖరారు కాలేదని ఆమె వెల్లడించారు. ఈ విషయంపై బంగ్లాదేశ్ లేదా భారత ప్రభుత్వాలతో తాను ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక లేదా అనధికారిక చర్చలు జరపలేదని హసీనా స్పష్టం చేశారు.