టీచర్లపై వైసీపీ దాడులు.. జోగి రమేశ్, వెల్లంపల్లి, దేవినేని అవినాశ్ తదితరులపై కేసులు

టీచర్లపై వైసీపీ దాడులు.. జోగి రమేశ్, వెల్లంపల్లి, దేవినేని అవినాశ్ తదితరులపై కేసులు

Jogi Ramesh and Vellampalli Srinivas booked for physical assault on teachers
  • విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద టీచర్లపై దాడి
  • దాడులను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
  • 250 మందికి పైగా వైసీపీ నేతలపై కేసులు నమోదు

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కార్యాలయం ఎదుట టీచర్లపై వైసీపీ నాయకులు, శ్రేణులు జరిపిన భౌతిక దాడి ఉదంతాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. సమాజానికి దిశానిర్దేశం చేసే గురువులపై దౌర్జన్యాలు, భౌతిక దాడులు చేయడాన్ని ఏమాత్రం సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పోలీస్ కమిషనర్‌ను సీఎం ఆదేశించారు.


దీనిపై వేగంగా స్పందించిన పోలీసులు విజయవాడలోని సూర్యారావుపేట, మాచవరం, కృష్ణలంక పోలీస్ స్టేషన్లలో కలిపి మొత్తం 6 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 250 మందికి పైగా వైసీపీ నాయకులు, శ్రేణులు, రౌడీషీటర్లపై హత్యాయత్నం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి, చట్టవిరుద్ధంగా గుమిగూడటం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసులు నమోదైన వారిలో మాజీ మంత్రులు జోగి రమేశ్, వెల్లంపల్లి శ్రీనివాస్, నేతలు జక్కంపూడి రాజా, దేవినేని అవినాశ్, పేర్ని కిట్టు, నాగార్జున యాదవ్ తదితరులు ఉన్నారు. 


మరోవైపు వైపు, వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు రవిచంద్రను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి మాచవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాడిలో పాల్గొన్న పలువురు రౌడీషీటర్లను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.

 

Advertisement
YSRCP Leaders
Vijayawada Teacher Attack
Jogi Ramesh
Vellampalli Srinivas
Devineni Avinash
Andhra Pradesh Police Cases

More Telugu News