నాని 'ది ప్యారడైజ్' చిత్రానికి టికెట్ ధరల పెంపు.. ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
- 'ది ప్యారడైజ్' టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి
- 10 రోజుల పాటు పెరగనున్న టికెట్ రేట్లు
- ప్రత్యేక ప్రీమియర్ షోలకు కూడా అనుమతి
- రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు అవకాశం
నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ టికెట్ ధరలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
విడుదలకు ఒక రోజు ముందు, అంటే సెప్టెంబర్ 23న ప్రత్యేక ప్రీమియర్ షోలు వేసుకునేందుకు కూడా అనుమతి లభించింది. ఈ ప్రీమియర్లకు మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధర రూ.400గా, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.300గా నిర్ణయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
ఇక, సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ.75, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50 చొప్పున అదనంగా వసూలు చేసుకోవచ్చు.
ఇదే సమయంలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ఏపీ సర్కార్ అనుమతులు జారీ చేసింది. తాజా అనుమతులతో సినిమాకు మంచి వసూళ్లు వస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.