డీఎస్సీపై దమ్ముంటే అసెంబ్లీకి రండి.. దాడులెందుకు?: వైసీపీపై చంద్రబాబు ఫైర్
- గురువులపై దాడులను చూస్తూ ఊరుకోబోమని సీఎం చంద్రబాబు హెచ్చరిక
- డీఎస్సీ నియామకాలపై అభ్యంతరాలుంటే కోర్టుకు వెళ్లాలని సూచన
- రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తామని వ్యాఖ్య
- గత ప్రభుత్వమిచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగానే నియామకాలు జరిగాయన్న సీఎం
- స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపు
"డీఎస్సీ నియామకాలపై దమ్ముంటే, ఆధారాలుంటే చర్చించడానికి అసెంబ్లీకి రండి.. వాస్తవాలతో మీ నోరు మూయిస్తాం. అంతేగానీ, ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులపై దాడులు చేయడమేంటి?" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇవాళ విజయవాడలో జరిగిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. గురువులపై 'గొడ్డలి పార్టీ' దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం కుప్పంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, నియామక ప్రక్రియపై అభ్యంతరాలుంటే న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉండగా, భౌతిక దాడులకు దిగడం రౌడీయిజానికి నిదర్శనమని మండిపడ్డారు.
గురువులపై దాడులు బరితెగింపే
ఉపాధ్యాయులపై దాడులు చేయడం దారుణమని, ఇది వారి బరితెగింపు చర్యలకు నిదర్శనమని చంద్రబాబు అన్నారు. "డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన వారు తమవి కష్టార్జితమని చెబుతున్నారు. క్రీడల్లో పతకాలు సాధించి, నిబంధనల ప్రకారమే ఉద్యోగాలు పొందారు. అలాంటి వారిని ఫేక్ అనడం, వారిపై దాడులకు దిగడం ఎంతవరకు సమంజసం? మీడియా ముసుగులో కుప్పంలో ఓ వైసీపీ అనుకూల రిపోర్టర్ ఆర్మీలో పనిచేసి వచ్చిన ఉపాధ్యాయుడిపైనే దాడికి పాల్పడ్డాడు. ఇది వారి అరాచక మనస్తత్వానికి అద్దం పడుతోంది. తమను ఫేక్ అని అవమానించడాన్ని ప్రశ్నించినందుకు రౌడీలతో దాడులు చేయిస్తారా? గురువులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం" అని చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు.
పారదర్శక నియామకాలే మా ట్రాక్ రికార్డ్
తమ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. "నా పాలనలో 14 సార్లు డీఎస్సీ నిర్వహించాం. ఎక్కడా అవినీతికి, లీకేజీలకు తావులేకుండా పూర్తిచేశాం. మెగా డీఎస్సీ - 2025ను అడ్డుకోవడానికి ఏకంగా 355 పిటిషన్లు వేసినా, వాటన్నింటినీ అధిగమించి చట్టబద్ధంగా నియామకాలు చేపట్టాం. ఏడాది తర్వాత ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారు" అని విమర్శించారు. స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు పొందిన వారికి గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన సర్టిఫికెట్ల ఆధారంగానే నియామకాలు జరిగాయని గుర్తుచేశారు.
"సర్టిఫికెట్లు ఇచ్చింది మీరు.. వాటి ఆధారంగా ఉద్యోగాలు పొందితే ఫేక్ అంటారా? కుక్క తోక వంకర అన్నట్టుగా ఉంది వీరి వ్యవహారం" అని ఎద్దేవా చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఆరోపణలపై ఉపాధ్యాయులే స్వయంగా కర్నూలు కొండారెడ్డి బురుజు, విజయవాడ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి, తమ ఉద్యోగాలు కష్టార్జితమని నినదించారని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం తరఫున ఇద్దరు మహిళా అధికారులు కూడా వాస్తవాలను వివరించారని, అయినా వైసీపీ నేతలు పెడచెవిన పెడుతున్నారని అన్నారు. "ఆరోపణలు చేసేవారికి దమ్ముంటే అసెంబ్లీకి రండి. సాక్ష్యాధారాలతో సమాధానం చెప్పి, వారి అబద్ధాలు తేలుస్తాం" అని సవాల్ విసిరారు.
రాజకీయ ముసుగులో రౌడీయిజం సహించం
2019-24 మధ్య రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిందని, ఎన్నికల్లో ఓడిపోయినా ఆ పార్టీ నేతల హింసాత్మక ధోరణి మారలేదని చంద్రబాబు విమర్శించారు. "కుప్పంలో నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఫ్లెక్సీలకు పొట్టేళ్లను బలిచ్చి రక్తాభిషేకాలు చేసే సంస్కృతి వారిది. రాజకీయ ముసుగులో ఇలాంటి రౌడీయిజాన్ని ఉపేక్షించం. వారి తోకలు కత్తిరిస్తాం. ఈ ప్రక్రియ కుప్పం నుంచే మొదలవ్వాలి" అని హెచ్చరించారు. అమరావతిని శ్మశానం అన్నవారు, నేడు అది అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి వార్డు, ప్రతి పంచాయతీలో కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.