శాప్ వద్ద రాద్ధాంతం చేసింది రౌడీషీటర్లు, వివిధ కేసుల్లో నిందితులే: హోంమంత్రి అనిత
- డీఎస్సీపై ఆందోళన చేసింది అభ్యర్థులు కాదు, రౌడీషీటర్లని హోంమంత్రి అనిత ఆరోపణ
శాప్ కార్యాలయం వద్ద అల్లర్లకు పాల్పడ్డారని అనిత ఆగ్రహం
లిక్కర్ స్కామ్‌ను పక్కదారి పట్టించేందుకే వైసీపీ కుట్ర అని విమర్శ
నిరసనకారుల్లో చాలామందిపై కేసులు ఉన్నాయని వెల్లడి
అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
డీఎస్సీ నియామకాలపై ఫిర్యాదు చేసేందుకు విజయవాడలోని శాప్ కార్యాలయానికి వచ్చిన వారు అభ్యర్థులు కాదని, వారిలో చాలామంది రౌడీషీటర్లు, ఇతర కేసుల్లో నిందితులు ఉన్నారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ ఈ రాద్ధాంతం సృష్టిస్తోందని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు అనిత ఓ వీడియో పోస్ట్ చేశారు.
శాప్ కార్యాలయం వద్దకు వచ్చిన వారి వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించామని అనిత తెలిపారు. "వారిలో విద్యపై అవగాహన ఉన్నవారు, ఏనాడైనా పరీక్ష రాసిన ముఖాలు ఒక్కటైనా ఉన్నాయా? డీఎస్సీపై మాట్లాడే అర్హత వారికి ఉందా?" అని అనిత ప్రశ్నించారు. కార్యాలయంలోకి వచ్చి అధికారులతో మాట్లాడే ధైర్యం లేక, గేటు బయటే కూర్చుని అల్లర్లకు పాల్పడ్డారని మండిపడ్డారు.
ఉపాధ్యాయులపై దాడులు చేయడం, రౌడీయిజం, దౌర్జన్యానికి పాల్పడటమే గొడ్డలి పార్టీ రాజకీయమా అని అనిత నిలదీశారు. చదువు పట్ల, చదువు చెప్పే ఉపాధ్యాయుల పట్ల జగన్‌కు కనీస గౌరవం కూడా లేదని దుయ్యబట్టారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ చేసిన వారికి, టీచర్ ఉద్యోగం కోసం పడే కష్టం ఎలా తెలుస్తుందని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. డీఎస్సీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని న్యాయస్థానమే స్పష్టం చేసినా, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ను లక్ష్యంగా చేసుకుని గొడ్డలి పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఒకే అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
శాప్ కార్యాలయం వద్ద అల్లర్లకు పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హోంమంత్రి స్పష్టం చేశారు. అందరిపైనా కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భావితరాలకు మార్గదర్శకులైన ఉపాధ్యాయులపై దాడులు చేయడం హేయమని, అలాంటి వారికి ప్రజాస్వామ్యంలో చోటు ఉండదని అనిత వ్యాఖ్యానించారు.