సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేసిన జింబాబ్వే ఆటగాడు
- సచిన్ సుదీర్ఘ వన్డే కెరీర్ రికార్డును బద్దలు కొట్టిన బ్రెండన్ టేలర్
- ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో బరిలోకి దిగి ఈ ఘనత
- 22 ఏళ్ల 146 రోజుల కెరీర్‌తో ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా గుర్తింపు
- 2027 ప్రపంచకప్ లక్ష్యంగా మళ్లీ జాతీయ జట్టుకు ఆడుతున్న టేలర్
జింబాబ్వే వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ బ్రెండన్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న సుదీర్ఘ వన్డే కెరీర్ రికార్డును టేలర్ బద్దలు కొట్టాడు. నేడు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో బరిలోకి దిగడం ద్వారా ఈ ఘనత సాధించాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో తన పునరాగమనాన్ని చిరస్మరణీయం చేసుకున్నాడు.
2004లో వన్డే అరంగేట్రం చేసిన బ్రెండన్ టేలర్, తన కెరీర్‌ను 22 ఏళ్ల 146 రోజులకు విస్తరించాడు. దీంతో ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం వన్డేలు ఆడిన ఆటగాడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (22 ఏళ్ల 91 రోజులు) పేరిట ఉండేది.
టేలర్ కెరీర్ ఎన్నో ఎత్తుపల్లాలతో నిండి ఉంది. జింబాబ్వే తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా (6,704) కొనసాగుతున్న టేలర్, 2015 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఇంగ్లండ్‌లో కోల్‌పాక్ ఒప్పందంపై ఆడాడు. రెండేళ్ల తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి తిరిగి వచ్చినా, 2021లో మరోసారి రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఆ తర్వాత 2019లో కొందరు బుకీలు తనకు కొకైన్ ఇచ్చి బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించారని, ఆ విషయాన్ని ఐసీసీకి చెప్పడంలో ఆలస్యం చేసినందుకు మూడున్నరేళ్ల నిషేధానికి గురయ్యానని వెల్లడించి సంచలనం సృష్టించాడు.
ఈ నిషేధం తర్వాత కోచింగ్‌పై దృష్టి పెట్టాలనుకున్న టేలర్‌ను జింబాబ్వే క్రికెట్ ఎండీ గివ్‌మోర్ మకోనీ ఒప్పించాడు. 2027 ప్రపంచకప్‌ను లక్ష్యంగా చేసుకుని తిరిగి జట్టులోకి రావాలని ప్రోత్సహించాడు. అతని మాటలతో స్ఫూర్తి పొందిన టేలర్, గతేడాది తిరిగి జాతీయ జట్టులోకి వచ్చి ఇప్పుడు సచిన్ రికార్డును బద్దలు కొట్టి తన పేరును క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.