విజయ్ రూపంలో వినాయకుడు.. తమిళనాట రాజకీయ దుమారం

విజయ్ రూపంలో వినాయకుడు.. తమిళనాట రాజకీయ దుమారం

Vijay lookalike Ganesh idols spark political row in Tamil Nadu
  • చెన్నైలో సీఎం విజయ్ కాన్సెప్ట్ తో గణనాథుడి విగ్రహాలు
  • తీవ్రంగా ఖండించిన తమిళనాడు బీజేపీ
  • ఇది దైవాన్ని అవమానించడమేనని నైనార్ నాగేంద్రన్ విమర్శ
  • విగ్రహాలు తొలగించాలని ఆదేశించినట్లు తెలిపిన టీవీకే వర్గాలు
తమిళనాడులో వినాయక చవితి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కొన్ని విగ్రహాలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ రూపాన్ని పోలిన గణపతి విగ్రహాలను చెన్నైలో ప్రతిష్టించడమే ఇందుకు కారణం. ఈ విగ్రహాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఘటనపై బీజేపీ బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తీవ్రంగా స్పందించారు. కోట్లాది మంది ఆరాధించే దైవ స్వరూపాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం గర్హనీయమని మండిపడ్డారు. మతపరమైన వేడుకలను టీవీకే తన ప్రచారానికి వినియోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి విజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించిన ఆయన, వెంటనే ఆ విగ్రహాలను తొలగించి, నిర్వాహకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ వివాదంపై టీవీకే వర్గాలు స్పందించాయి. ఇప్పటికే సంబంధిత వ్యక్తులకు సూచనలు జారీ చేసి, ఆ విగ్రహాలను తొలగించాలని ఆదేశించినట్లు వెల్లడించాయి. విజయ్ అభిమానులు గత ఎనిమిదేళ్లుగా ఇలాంటి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారని, ఇందులో కొత్తేమీ లేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Advertisement
Vijay
Tamilaga Vettri Kazhagam
Ganesh Chaturthi controversy
Nainar Nagendran
Tamil Nadu politics
Chennai

More Telugu News