ఆళ్ల నాని మృతి తీవ్ర దిగ్భ్రాంతికరం: పల్లా శ్రీనివాసరావు

ఆళ్ల నాని మృతి తీవ్ర దిగ్భ్రాంతికరం: పల్లా శ్రీనివాసరావు

Alla Nani death is deeply shocking says Palla Srinivasa Rao
  • మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆకస్మిక మృతి
  • ఆయన మరణం పట్ల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందన
  • ప్రజాప్రతినిధిగా, మంత్రిగా నాని సేవలను గుర్తు చేసుకున్న పల్లా
  • ఆళ్ల నాని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటన
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడి
రాష్ట్ర మాజీ మంత్రి, టీడీపీ నేత ఆళ్ల ఆళ్ల నాని ఆకస్మిక మరణం పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆళ్ల నాని మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు స్పందిస్తూ.. ప్రజాప్రతినిధిగా, రాష్ట్ర మంత్రిగా ఆళ్ల నాని ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆయనతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన మృతి రాష్ట్రానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు. ఆళ్ల నాని కుటుంబ సభ్యులకు తన తరఫున, తెలుగుదేశం పార్టీ శ్రేణుల తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పల్లా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

56 ఏళ్ల ఆళ్ల నాని ఇవాళ విశాఖలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే ఆయన ప్రాణాలు విడిచారు. ఆళ్ల నాని మృతితో టీడీపీలో విషాద ఛాయలు అలముకున్నాయి. 
Advertisement
Alla Nani
Palla Srinivasa Rao
TDP leader Alla Nani
Former Minister Alla Nani death
Andhra Pradesh politics
Alla Nani cardiac arrest

More Telugu News