దుమారం రేపుతున్న సిడ్నీ స్వీనీ యాడ్.. క్రీడల్లో మహిళలు ఇలా ఉండరంటూ క్రీడాకారిణుల ఫైర్

దుమారం రేపుతున్న సిడ్నీ స్వీనీ యాడ్.. క్రీడల్లో మహిళలు ఇలా ఉండరంటూ క్రీడాకారిణుల ఫైర్

Sydney Sweeney ad sparks controversy as female athletes slam portrayal of women in sports
  • హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ యాడ్‌పై మహిళా అథ్లెట్ల విమర్శలు
  • క్రీడల్లో మహిళలను లైంగిక వస్తువుగా చూపించారని ఆరోపణ
  • మా కండలు, కన్నీళ్లే మా రూపమంటూ అథ్లెట్ల ఘాటు స్పందన
  • 'నోవిగ్' సంస్థ కోసం చేసిన ప్రకటనతో రాజుకున్న వివాదం
  • విమర్శలపై ఇంకా స్పందించని సిడ్నీ స్వీనీ, సంస్థ
ప్రముఖ అమెరికన్ నటి సిడ్నీ స్వీనీ నటించిన ఒక వాణిజ్య ప్రకటన ఇప్పుడు తీవ్ర వివాదాన్ని రాజేసింది. స్పోర్ట్స్ ప్రెడిక్షన్ ప్లాట్‌ఫామ్ అయిన 'నోవిగ్' కోసం రూపొందించిన ఈ యాడ్‌లో క్రీడల్లో మహిళలను లైంగిక వస్తువుగా, కించపరిచేలా చూపించారంటూ ప్రపంచవ్యాప్తంగా మహిళా అథ్లెట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాడ్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది.

ఈ వివాదాస్పద యాడ్‌లో సిడ్నీ స్వీనీ దాదాపు దుస్తులు లేకుండా, ఫుట్‌బాల్స్, ఇతర క్రీడా పరికరాలతో శరీరాన్ని కప్పుకున్నట్లుగా కనిపించారు. దీనిపై నాలుగుసార్లు ఒలింపిక్ స్విమ్మింగ్ స్వర్ణ పతక విజేత, ఆస్ట్రేలియాకు చెందిన అరియార్న్ టిట్మస్ తీవ్రంగా స్పందించింది. 

"ఇది చూసి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మన సమాజం ఇప్పటికీ మహిళల శరీరాలను అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించడం, మహిళల క్రీడలను లైంగిక వస్తువులుగా చూపించడం ఆపలేదా?" అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్నించింది.

బ్రిటిష్ స్ప్రింటర్ అమీ హంట్ మరో అడుగు ముందుకేసి, బుడాపెస్ట్‌లో జరిగిన అల్టిమేట్ ఛాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల రేసులో నాలుగో స్థానంలో నిలిచిన తర్వాత బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేరుగా స్పందించింది. 

ఆమె కెమెరా వైపు చూస్తూ.. "సిడ్నీ స్వీనీ, క్రీడల్లో మహిళలు ఇలా ఉంటారు. కండలు, కఠోర శ్రమ, చెమట, రక్తం, కన్నీళ్లు.. ఇదీ మా రూపం" అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.

అమెరికా మాజీ జిమ్నాస్ట్ గ్రేసీ క్రామర్, చైనీస్-జర్మన్ రగ్బీ ప్లేయర్ సోఫీ ఫెల్లా కూడా ఈ యాడ్‌ను తీవ్రంగా విమర్శించారు. క్రీడాకారిణుల విజయాల కన్నా వారి శరీరాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇది అగౌరవపరిచే చర్య అని వారు అభిప్రాయపడ్డారు.

ఈ విమర్శలపై నోవిగ్ సంస్థ గానీ, సిడ్నీ స్వీనీ ప్రతినిధులు గానీ ఇంకా స్పందించలేదు. అయితే, వారాంతంలో సిడ్నీ స్వీనీ 'ఈఎస్‌పీఎన్ మ్యాగజైన్'కు చెందిన 'బాడీ ఇష్యూ' పాత కవర్ ఫొటోలను పోస్ట్ చేశారు. 

గతంలో కూడా అథ్లెట్లు నగ్నంగా, సెమీ-న్యూడ్‌గా పోజులిచ్చిన సందర్భాలను ఆమె పరోక్షంగా గుర్తు చేశారు. మొత్తంమీద ఈ యాడ్ క్రీడారంగంలో మహిళల ప్రాతినిధ్యం, వారిని చిత్రీకరిస్తున్న తీరుపై మరోసారి పెద్ద చర్చకు దారితీసింది.

Advertisement
Sydney Sweeney
Novig ad controversy
Ariarne Titmus
Female athlete representation
Amy Hunt
Women in sports controversy

More Telugu News