రెండో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య
- ఐరిష్ ఫైనాన్షియర్ కామెరాన్ ఓ'రైల్లీని పెళ్లాడిన జెమీమా గోల్డ్‌స్మిత్
- నిరాడంబరంగా, కొద్దిమంది సమక్షంలో జరిగిన వేడుక
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్యగా సుపరిచితురాలు
- ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోతో పెళ్లి విషయాన్ని ధ్రువీకరించిన బంధువులు
- 2004లో ఇమ్రాన్‌తో విడిపోయిన తర్వాత జెమీమాకు ఇది రెండో వివాహం
పాకిస్థాన్ మాజీ ప్రధాని, క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య, ప్రముఖ బ్రిటిష్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ జెమీమా గోల్డ్‌స్మిత్ (52) తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆమె ఐర్లాండ్‌కు చెందిన మల్టీ-మిలియనీర్ ఫైనాన్షియర్ కామెరాన్ ఓ'రైల్లీ (62)ని వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహ వేడుక నిరాడంబరంగా, ప్రైవేట్‌గా జరిగింది.
ఈ పెళ్లి విషయాన్ని జెమీమా సోదరుడు బెన్ గోల్డ్‌స్మిత్ భార్య, జెమీమా జోన్స్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా ధ్రువీకరించారు. తన భర్తతో కలిసి పెళ్లి వేడుకకు హాజరైన ఫొటోను షేర్ చేస్తూ.. "జెమీమా, కామెరాన్‌ల పెళ్లిని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ఎంతో సంతోషకరమైన రోజు" అని ఆమె క్యాప్షన్ రాశారు. దీంతో వీరి వివాహ వార్త వెలుగులోకి వచ్చింది.
ఫిల్మ్, డాక్యుమెంటరీ రంగంలో పనిచేస్తున్న జెమీమా, కామెరాన్‌లకు తమ వృత్తిపరమైన పనుల్లోనే పరిచయం ఏర్పడినట్టు తెలుస్తోంది. దాదాపు ఏడాది కాలంగా వీరు డేటింగ్‌లో ఉన్నారని సమాచారం. ఇమ్రాన్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న సుమారు 20 సంవత్సరాల తర్వాత జెమీమా రెండో వివాహం చేసుకోవడం గమనార్హం.
1995లో ఇమ్రాన్ ఖాన్‌ను పెళ్లాడిన ఆమె, 2004లో విడాకులు తీసుకున్నారు. వీరికి సులేమాన్, కాసిమ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పాకిస్థాన్‌లో జైలు జీవితం గడుపుతున్న ఇమ్రాన్ ఖాన్‌కు జెమీమా, ఆమె కుమారులు ఇటీవల బహిరంగంగా మద్దతు తెలిపారు.
జెమీమాను పెళ్లాడిన కామెరాన్ ఓ'రైల్లీ కూడా ప్రముఖులే. ఆయన ఐర్లాండ్ మీడియా దిగ్గజం, మాజీ రగ్బీ ప్లేయర్ అయిన దివంగత సర్ ఆంథోనీ ఓ'రైల్లీ కుమారుడు. ఆక్స్‌ఫర్డ్ గ్రాడ్యుయేట్ అయిన కామెరాన్, తన తండ్రి మీడియా వ్యాపారాల్లో పనిచేసి, ఆ తర్వాత ప్రైవేట్ ఈక్విటీ రంగంలోకి అడుగుపెట్టారు. స్విట్జర్లాండ్‌కు చెందిన 'ల్యాండిస్+గైర్' అనే సంస్థకు నాయకత్వం వహించారు. కామెరాన్‌కు కూడా ఇదివరకే వివాహం కాగా, నలుగురు పిల్లలు ఉన్నారు.