లండన్ లో విజయ్ సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది విదేశీ కంపెనీ కాదు.. నోయిడా కంపెనీ: అన్నాడీఎంకే ఫైర్
- తమిళనాడు సీఎం విజయ్ యూకే పర్యటనపై రాజకీయ దుమారం
- ప్రజాధనంతో ఈ పర్యటన అవసరమా అని ప్రశ్నిస్తున్న అన్నాడీఎంకే
- నోయిడా సంస్థతో ఒప్పందం కోసం యూకే వెళ్లడం ఏంటని విమర్శలు
- రూ. 11,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం
- ఈ ఒప్పందంతో 7,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చేపట్టిన బ్రిటన్ (యూకే) పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజాధనంతో ఈ విదేశీ పర్యటన అవసరమా అంటూ ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.
అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ మాట్లాడుతూ, ఈ పర్యటనలో భాగంగా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న 'సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్' 1986లోనే స్థాపించబడిన భారతీయ సంస్థ అని, దీని ప్రధాన కార్యాలయం నోయిడాలో ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు. నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ నుంచి పెట్టుబడులు ఆకర్షించడానికి బ్రిటన్ వరకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సైతం ఈ పర్యటనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సిల్వర్‌స్టోన్‌లో సీఎం విజయ్ ఒక మోటార్ రేస్‌ను జెండా ఊపి ప్రారంభిస్తున్న ఫొటోలను ప్రస్తావిస్తూ, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ఈ పర్యటన ఉద్దేశమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవ దృశ్యాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉండగా, నేడు లండన్ వేదికగా 'సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్' తన యూరోపియన్, యూకే జాయింట్ వెంచర్ భాగస్వాములతో కలిసి తమిళనాడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీని ద్వారా రాష్ట్రంలో సుమారు రూ. 11,000 కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి. ఈ భారీ పెట్టుబడితో డిజైన్, ఇంజినీరింగ్, తయారీ రంగాల్లో దాదాపు 7,000 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
అధునాతన తయారీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి విజయ్ వారం రోజుల పాటు బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో బ్రిటన్‌లోని భారత హైకమిషనర్ కుమరన్ పెరియసామితో పాటు తమిళనాడు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.