దేశంలోనే తొలిసారిగా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నాం: మంత్రి సవిత

దేశంలోనే తొలిసారిగా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నాం: మంత్రి సవిత

Minister Savitha says BC Protection Act being brought for first time in India
  • బీసీ రక్షణ చట్టం అవగాహన సదస్సులో పాల్గొన్న సవిత
  • బీసీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక గుర్తింపు చంద్రబాబుతోనే సాధ్యమని వ్యాఖ్య
  • జగన్ ప్రభుత్వం బీసీలకు ద్రోహం చేసిందని విమర్శ

బీసీల ఆత్మగౌరవ జీవనమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి సవిత స్పష్టం చేశారు. విజయవాడ సమీపంలోన ఉన్న గొల్లపూడి బీసీ భవన్‌లో నిర్వహించిన ‘బీసీ రక్షణ చట్టం’ అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీసీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక గుర్తింపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోనే సాధ్యపడుతుందని చెప్పారు.


ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ‘బీసీ రక్షణ చట్టం’ తీసుకొస్తున్నామని మంత్రి వెల్లడించారు. బీసీలను కులం లేదా వృత్తుల పేరుతో దూషించినా, సంఘ బహిష్కరణకు గురిచేసినా కఠిన శిక్షలు పడేలా జిల్లాల్లో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి, 2 నెలల్లోనే విచారణ పూర్తిచేసేలా పక్కా నిబంధనలు రూపొందించామని స్పష్టం చేశారు. ఈ చట్టం కోర్టులలో బలంగా నిలబడేలా 156 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకున్నామన్నారు.


గత జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించి ద్రోహం చేసిందని మంత్రి విమర్శించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తుందని ప్రకటించారు. అంతేకాకుండా చేతివృత్తుల వారికి ఊతమిచ్చే ‘ఆదరణ 3.0’ పథకాన్ని కూడా త్వరలోనే అమల్లోకి తెస్తామని హామీ ఇచ్చారు.

Advertisement
Minister Savitha
BC Protection Act
Andhra Pradesh Government
Nara Lokesh
BC Reservation
Adarana 3.0 Scheme

More Telugu News