న్యూఢిల్లీ డిక్లరేషన్.. ఐరాస నుంచి గాజా వరకు.. బ్రిక్స్ కీలక తీర్మానాలు ఇవే!
- ఐరాస భద్రతామండలి, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సంస్కరణలకు మద్దతు
- ఏకపక్ష ఆంక్షలు, సుంకాలు, రక్షణాత్మక వాణిజ్య విధానాలకు వ్యతిరేకత
- గాజాలో కాల్పుల విరమణ, మానవతా సాయం కొనసాగాలని డిమాండ్
- జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తూ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం
- ఉగ్ర నిధులు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో సహకారానికి పిలుపు
న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సులో సభ్య దేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రపంచ వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాధాన్యం కల్పించాలని న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో పిలుపునిచ్చాయి. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాలకు అంతర్జాతీయ సంస్థల్లో ఎక్కువ ప్రాతినిధ్యం ఉండాలని స్పష్టం చేశాయి. ప్రపంచ వ్యవస్థ మరింత ప్రజాస్వామ్యబద్ధంగా, బహుళ ధ్రువంగా మారాలని బ్రిక్స్ నేతలు ఆకాంక్షించారు.
ఐరాసలో సంస్కరణలకు మద్దతు
ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సంస్కరణలకు బ్రిక్స్ మరోసారి మద్దతు తెలిపింది. భారత్, బ్రెజిల్‌కు ఐరాసలో, ముఖ్యంగా భద్రతామండలిలో, మరింత కీలక పాత్ర కల్పించాలన్న ఆకాంక్షలకు చైనా, రష్యా మద్దతు తెలిపిన విషయాన్ని ప్రకటనలో స్వాగతించారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సహా బ్రెట్టన్ వుడ్స్ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ఓటింగ్ హక్కు, నిర్ణయాధికారం పెరగాలని కోరారు. ఐరాసలో ఉన్నత పదవుల్లో మహిళల ప్రాతినిధ్యం కూడా పెరగాలని పేర్కొన్నారు.
ఆంక్షలు, వాణిజ్య అడ్డంకులపై ఆగ్రహం
ఏకపక్ష ఆర్థిక ఆంక్షలు, ఇతర దేశాలపై విధించే ద్వితీయ ఆంక్షలను బ్రిక్స్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇవి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఆహార భద్రత, ఆరోగ్యం, అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొంది. ఏకపక్ష సుంకాలు, పన్నేతర ఆంక్షలు, రక్షణాత్మక వాణిజ్య విధానాలు ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థలో వివాద పరిష్కార వ్యవస్థను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని కోరింది. డబ్ల్యూటీవో అప్పీలేట్ బాడీలో కొత్త సభ్యుల నియామకానికి మద్దతు తెలిపింది.
గాజాపై స్పష్టమైన వైఖరి
అంతర్జాతీయ వివాదాలకు యుద్ధం కాకుండా చర్చలు, దౌత్యం, మధ్యవర్తిత్వమే పరిష్కార మార్గాలని బ్రిక్స్ పేర్కొంది. గాజాలో కాల్పుల విరమణ కొనసాగాలని, మానవతా సాయం ఎలాంటి అడ్డంకులు లేకుండా అందాలని కోరింది. పాలస్తీనియన్లను బలవంతంగా తరలించడాన్ని ఆపాలని, పౌరులు, పౌర మౌలిక వసతులకు రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది.
1967 సరిహద్దుల ఆధారంగా రెండు దేశాల పరిష్కారానికి మద్దతు తెలిపింది. తూర్పు జెరూసలేం పాలస్తీనా రాజధానిగా ఉండాలని పేర్కొంది. ఐరాసలో పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వానికి మద్దతు ఇచ్చింది. లెబనాన్‌లో కాల్పుల విరమణను స్వాగతిస్తూ ఐరాస తీర్మానం 1701 అమలు చేయాలని కోరింది.
సూడాన్, సిరియాపైనా కీలక పిలుపు
సూడాన్‌లో తక్షణమే శాశ్వత కాల్పుల విరమణ జరగాలని బ్రిక్స్ కోరింది. ప్రజలకు మానవతా సాయం అందించేందుకు అడ్డంకులు తొలగించాలని పేర్కొంది. సమస్యకు ఆఫ్రికా దేశాలే పరిష్కారం చూపాలన్న విధానాన్ని సమర్థించింది. సిరియాలో ఆ దేశ ప్రజల ఆధ్వర్యంలో, ఐరాస సహకారంతో రాజకీయ ప్రక్రియ కొనసాగాలని తెలిపింది. ఆక్రమణ దళాలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని పిలుపునిచ్చింది.
ఉగ్రవాదంపై కఠిన నిర్ణయం
ఉగ్రవాదానికి ఎలాంటి మినహాయింపులు ఉండకూడదని బ్రిక్స్ స్పష్టం చేసింది. అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని ఖండించింది. 2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గావ్‌లో జరిగిన ఉగ్రదాడిని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఖండించింది. ఐరాసలో సమగ్ర అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక ఒప్పందాన్ని త్వరగా ఆమోదించాలని కోరింది.
ఉగ్రవాదానికి నిధులు, మానవ అక్రమ రవాణా, ఆయుధాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు దేశాల మధ్య సహకారం పెరగాలని సూచించింది. డ్రగ్స్ ద్వారా జరిగే మనీలాండరింగ్, సైబర్ నేరాలు, అక్రమ వర్చువల్ ఆస్తుల లావాదేవీలపైనా దృష్టి పెట్టాలని పేర్కొంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాల నెట్‌వర్క్‌లను ఎదుర్కొనేందుకు సమన్వయం పెంచాలని తెలిపింది. ఆస్తుల రికవరీ, పరారీలో ఉన్న నిందితుల గుర్తింపు, సరిహద్దులు దాటి జరిగే అవినీతిని అడ్డుకునే కొత్త సహకార విధానాలను కూడా బ్రిక్స్ స్వాగతించింది.