జిన్‌పింగ్‌కు నరేంద్ర మోదీ తన ఫొటోను బహుమతిగా ఇచ్చారా? అసలు నిజం ఇదే!

జిన్‌పింగ్‌కు నరేంద్ర మోదీ తన ఫొటోను బహుమతిగా ఇచ్చారా? అసలు నిజం ఇదే!

Did Narendra Modi gift his photo to Xi Jinping Here is the real truth
  • మోదీ, జిన్‌పింగ్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
  • వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అని స్పష్టం చేసిన పీఐబీ
  • ఇది ఏడేళ్ల క్రితం నాటి మహాబలిపురం భేటీ వీడియో
  • ఆనాడు జిన్‌పింగ్‌కు ఆయన ఫొటోనే కానుకగా ఇచ్చిన మోదీ
ప్రస్తుతం జరుగుతున్న బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత చిత్రపటాన్ని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు బహుమతిగా ఇచ్చారంటూ సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో విపరీతంగా ప్రచారమవుతోంది. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వ అధికారిక సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. ఇది పూర్తిగా నిరాధారమైన, తప్పుడు సమాచారమని వెల్లడించింది.

వాస్తవానికి ఈ వీడియో 2019 అక్టోబర్ 12 నాటిది. తమిళనాడులోని మహాబలిపురంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య జరిగిన అనధికారిక భేటీ సందర్భంగా చోటుచేసుకున్న దృశ్యాలివి. ఆ సమావేశంలో ప్రధాని మోదీ, కంచి పట్టు, బంగారు జరీతో ప్రత్యేకంగా నేయించిన షీ జిన్‌పింగ్ చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు. దీనికి ప్రతిగా జిన్‌పింగ్ కూడా ప్రధాని మోదీ చిత్రం చెక్కిన పింగాణీ జ్ఞాపికను ఆయనకు అందజేశారు.

అయితే, కొందరు ఈ పాత వీడియోను ప్రస్తుత బ్రిక్స్ సదస్సుతో ముడిపెడుతూ, బహుమతుల మార్పిడికి సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏళ్ల తర్వాత ఇరు దేశాల అధినేతలు భేటీ అవుతున్న తరుణంలో, ఈ పాత వీడియోను ప్రస్తుతానిదిగా చిత్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ అసత్య ప్రచారంపై పీఐబీ స్పందిస్తూ, 2019 నాటి సమావేశానికి సంబంధించిన అసలు చిత్రాలను సాక్ష్యంగా చూపుతూ 'ఎక్స్' వేదికగా స్పష్టతనిచ్చింది.
Advertisement
Narendra Modi
Xi Jinping
PIB Fact Check
BRICS Summit
Mahabalipuram Summit
Viral Video Truth

More Telugu News