దివ్యాంగుల పింఛన్లపై సీతక్క కీలక ప్రకటన.. ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి!

దివ్యాంగుల పింఛన్లపై సీతక్క కీలక ప్రకటన.. ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి!

Seethakka key announcement on disability pensions apply by this date
  • దివ్యాంగుల పింఛన్లకు సెప్టెంబర్‌ 15 చివరి తేదీ
  • రాష్ట్రంలో 4,66,351 మంది దివ్యాంగులకు పింఛన్లు ఇస్తున్నామన్న మంత్రి సీతక్క
  • ఇప్పటివరకు 1,23,199 దరఖాస్తులు వచ్చాయని వెల్లడి
  • క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత పింఛన్లు మంజూరు చేస్తామని హామీ
  • అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని స్పష్టీకరణ
తెలంగాణలో అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్‌ 15 చివరి తేదీ అని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,66,351 మంది దివ్యాంగులు పింఛన్లు పొందుతున్నారని చెప్పారు. ఇప్పటివరకు దివ్యాంగుల పింఛన్ల కోసం 1,23,199 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించిన తర్వాత అర్హత ఉన్నవారికి పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. థలసేమియా బాధితులకు పింఛన్లు అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారని తెలిపారు.

సదరం సర్టిఫికెట్లను గడువులోగా రెన్యువల్‌ చేసుకోకపోవడం వల్ల కొందరికి పింఛన్లు నిలిచిపోతున్నాయని సీతక్క చెప్పారు. అర్హులైన వారు తమ సదరం సర్టిఫికెట్లను తప్పనిసరిగా రెన్యువల్‌ చేసుకోవాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్‌ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
Advertisement
Seethakka
Telangana Disability Pension
Divyangula Pension Application
SADAREM Certificate Renewal
Telangana Government Schemes
Revanth Reddy

More Telugu News