పదేళ్ల కనిష్ఠానికి స్మార్ట్ ఫోన్ అమ్మకాలు..చైనా ఫోన్ల హవాకు బ్రేక్!
- ధరలు పెరగడంతో కొనుగోళ్లకు దూరంగా ఉంటున్న ప్రజలు
- 9 త్రైమాసికాల తర్వాత అగ్రస్థానాన్ని దక్కించుకున్న శాంసంగ్
- రూ. 20,000 లోపు ఫోన్ల విక్రయాలలో భారీ పతనం
- చైనా బ్రాండ్ల వాటాలో తగ్గుదల.. వృద్ధిలో దూసుకెళ్లిన దేశీయ బ్రాండ్
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ప్రస్తుతం తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. 2026 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 20 శాతం పడిపోయాయి. గత పదేళ్ల కాలంలో విక్రయాలు ఇంతటి కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో, తొమ్మిది త్రైమాసికాల తర్వాత శాంసంగ్ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
రికార్డు స్థాయిలో పెరిగిన మెమరీ చిప్ ధరలే ఈ పతనానికి ప్రధాన కారణంగా నిలిచాయి. చిప్ ధరల పెరుగుదలతో స్మార్ట్‌ఫోన్ల తయారీ వ్యయం అధికమైంది. ఫలితంగా కంపెనీలు ఫోన్ల ధరలను పెంచక తప్పలేదు. పండుగ సీజన్ సమీపిస్తున్నప్పటికీ, పెరిగిన ధరల కారణంగా వినియోగదారులు కొనుగోళ్లకు విముఖత చూపుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే, 2026 పూర్తి సంవత్సరానికి స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సుమారు 13 శాతం క్షీణించే అవకాశం ఉందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ అంచనా వేశారు.
ధరల పెరుగుదల ప్రభావం ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్‌పై తీవ్రంగా పడింది. రూ.20,000 లోపు ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు ఏకంగా 47 శాతం మేర పడిపోయాయి. ప్రధానంగా రూ. 15,000 లోపు మార్కెట్ బలహీనపడటంతో, మెజారిటీ వినియోగదారులు కొత్త ఫోన్‌ల కొనుగోలును వాయిదా వేసుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మార్కెట్ వాటాలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 17 శాతం మార్కెట్ వాటాతో శాంసంగ్ తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గెలాక్సీ ‘ఎ’ సిరీస్ ఫోన్ల అమ్మకాలతో పాటు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో అనుసరించిన వ్యూహాలు ఇందుకు దోహదపడ్డాయి. టాప్-5 బ్రాండ్లలో వృద్ధి నమోదు చేసిన ఏకైక సంస్థగా శాంసంగ్ నిలవడం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో వివో (16%), ఒప్పో (12%) నిలిచాయి. షావోమి, యాపిల్ సంస్థలు చెరో 8 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మరోవైపు, ధరల ఒత్తిడి కారణంగా చైనా బ్రాండ్ల ఉమ్మడి వాటా తగ్గింది. ఇదే క్రమంలో, దేశీయ బ్రాండ్ ‘ఏఐ+’ (Ai+) అమ్మకాల్లో 306 శాతం వృద్ధితో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా అవతరించింది.