కోటి ఇళ్లను దాటి మరింత ముందుకు... 43వ రోజు విజయవంతంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం–2026’
- 43వ రోజుకు చేరిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం
- ఇప్పటివరకు 1.06 కోట్ల ఇళ్లను సందర్శించిన టీడీపీ శ్రేణులు
- సోమవారం ఒక్కరోజే 1.30 లక్షల కుటుంబాలతో నేతల భేటీ
- కూటమి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ, ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణ
- కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్న టీడీపీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారంతో ఈ కార్యక్రమం 43వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.06 కోట్ల ఇళ్లను సందర్శించి ఈ కార్యక్రమం ఒక కీలక మైలురాయిని దాటింది.
ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం, వారి అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఒక్కరోజే టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి 1,30,402 ఇళ్లను సందర్శించారు. ప్రతి గడపకూ వెళ్లి కుటుంబ సభ్యులతో ముఖాముఖిగా సంభాషిస్తూ ప్రభుత్వ పనితీరును వివరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ శ్రేణులు.. రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్యతరగతి వర్గాలకు అందుతున్న పథకాల ప్రయోజనాలను తెలియజేస్తున్నారు. అదే సమయంలో, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేసేలా వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని, పార్టీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఉత్సాహంగా ఇందులో భాగస్వాములవుతున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది.