చైనాలో మార్మోగిన ప్రభాస్‌-త్రిష పాట.. షాంఘై యువతి అదిరిపోయే డాన్స్‌

చైనాలో మార్మోగిన ప్రభాస్‌-త్రిష పాట.. షాంఘై యువతి అదిరిపోయే డాన్స్‌

Prabhas Trisha song echoes in China as Shanghai girl performs amazing dance
  • ‘భరత వేదముగా’ పాట మరోసారి వైరల్‌
  • చైనా డ్యాన్సర్‌ మీరా వాంగ్‌ నృత్యం
  • భారతీయ శాస్త్రీయ శైలిలో అద్భుత ప్రదర్శన
  • సోషల్‌ మీడియాలో వీడియోకు భారీ స్పందన
  • వేణుగోపాల్‌ వద్ద నృత్యం నేర్చుకుంటున్నట్లు సమాచారం
ప్రభాస్‌ కెరీర్‌లో వచ్చిన సినిమాల్లో కొన్ని బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. వాటిలోని పాటలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అలాంటి వాటిలో ‘పౌర్ణమి’ ఒకటి. ప్రభాస్‌, త్రిష, ఛార్మి నటించిన ఈ సినిమాలోని పాటలకు అప్పట్లోనే మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ‘భరత వేదముగా’ పాటకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 2006లో విడుదలైన ఈ పాట ఇప్పుడు మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

దీనికి కారణం ఓ చైనా డ్యాన్సర్‌ చేసిన అద్భుతమైన నృత్య ప్రదర్శన. మీరా వాంగ్‌ అనే చైనీస్‌ డ్యాన్సర్‌ ‘భరత వేదముగా’ పాటకు భారతీయ శాస్త్రీయ నృత్య శైలిలో చేసిన డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాటకు తగ్గట్టుగా ఆమె వేసిన అడుగులు, హావభావాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

తెలుగు భాష తెలియని చైనాకు చెందిన ఓ డ్యాన్సర్‌ మన సినిమా పాటను ఎంచుకుని ఇంత అందంగా నృత్యం చేయడం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆమె ప్రదర్శనకు సోషల్‌ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ‘భరత వేదముగా’ పాటకు మరోసారి భారీగా రీచ్‌ వస్తోంది.

మీరా వాంగ్‌కు భారతీయ శాస్త్రీయ నృత్యంపై ఎంతో ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె అనంతపురానికి చెందిన వేణుగోపాల్‌ వద్ద కూచిపూడి నేర్చుకుంటున్నట్లు సమాచారం. భారత్‌కు రాకుండానే కూచిపూడి నృత్యాన్ని అభ్యసిస్తూ.. తన ప్రదర్శనలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారట. అంతేకాదు.. ‘మాయాబజార్‌’లోని ‘అహా నా పెళ్లంట’ పాటకు కూడా ఆమె నృత్యం చేసిన వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది.

భాష, దేశాల సరిహద్దులు దాటి తెలుగు సినిమా పాటకు వస్తున్న ఈ స్పందన ఇప్పుడు టాలీవుడ్‌ అభిమానులను కూడా ఆకట్టుకుంటోంది.
Advertisement
Prabhas
Meera Wang
Pournami Movie Song
Bharata Vedamuga Dance
Chinese Kuchipudi Dancer
Trisha Krishnan

More Telugu News