తగ్గుతున్న ఉత్పత్తి.. పెరుగుతున్న ధరలు.. కాపర్‌కు ఎందుకింత డిమాండ్?
- లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్‌లో రాగి ధర సరికొత్త రికార్డు
- అమెరికా టారిఫ్ భయాలతో సరఫరాలో అనూహ్య మార్పులు
- దేశీయ మార్కెట్లోనూ భారీగా పెరిగిన కాపర్ ఫ్యూచర్స్ ధర
- హిందుస్థాన్ కాపర్ షేర్లు 5 శాతానికి పైగా లాభం
అంతర్జాతీయ మార్కెట్లో రాగి (కాపర్) ధర చుక్కలనంటుతోంది. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ (ఎల్ఎంఈ)లో రాగి ధర చారిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. శుద్ధి చేసిన రాగిపై అమెరికా భారీగా సుంకాలు (టారిఫ్‌లు) విధించవచ్చన్న అంచనాలతో వ్యాపారులు పెద్ద ఎత్తున నిల్వలను అమెరికాకు తరలిస్తుండటమే ఈ అనూహ్య పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఇవాళ ట్రేడింగ్‌లో ఎల్ఎంఈలో మూడు నెలల కాపర్ ఫ్యూచర్స్ ధర 0.8 శాతం పెరిగి మెట్రిక్ టన్నుకు 14,533 డాలర్ల (రూ. 13.73లక్షలు)వద్ద ఆల్ టైమ్ హైకి చేరింది. ఈ ఏడాది జనవరిలో నమోదైన 14,527.50 డాలర్ల (రూ. 13.72లక్షలు) రికార్డును ఇది అధిగమించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రాగి ధర సుమారు 17 శాతం పెరగ్గా, గత 12 నెలల్లో ఏకంగా 47 శాతం మేర వృద్ధిని నమోదు చేసింది.
ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా స్పష్టంగా కనిపిస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో సెప్టెంబర్ కాపర్ ఫ్యూచర్స్ 1.21 శాతం (రూ. 16.8) పెరిగి ఉదయం 10:30 గంటలకే రూ. 1,403.50 ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ షేర్లు కూడా బీఎస్‌ఈలో 5 శాతానికి పైగా లాభపడి రూ. 537.35 వద్ద ట్రేడ్ అయ్యాయి.
రాగి ధరల పెరుగుదలకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక కారణాలు రెండూ ఉన్నాయి. డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, పవర్ గ్రిడ్ల నుంచి డిమాండ్ విపరీతంగా పెరుగుతుండగా, పాత గనుల నుంచి ఉత్పత్తి ఆ స్థాయిలో పెరగడం లేదు. ఇది దీర్ఘకాలంగా ధరలకు మద్దతు ఇస్తోంది.
అయితే, తాజా పెరుగుదలకు ప్రధాన కారణం అమెరికా టారిఫ్‌లకు సంబంధించిన పరిణామాలే. రిఫైన్డ్ కాపర్‌పై సుంకాల విషయంలో అమెరికా వాణిజ్య శాఖ జూన్ 30 నాటికి తన నివేదికను వైట్‌హౌస్‌కు ఇవ్వాల్సి ఉన్నా, రెండు నెలలు దాటినా తుది నిర్ణయం వెలువడలేదు. దీంతో వ్యాపారులు ముందుజాగ్రత్తగా తమ నిల్వలను అమెరికాకు తరలిస్తున్నారు. ఫలితంగా ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా ఎల్ఎంఈ నెట్‌వర్క్‌లో రాగి లభ్యత తగ్గిపోయి ధరలు పెరుగుతున్నాయి.
మరోవైపు, 2026 మొదటి అర్ధభాగంలో ప్రపంచవ్యాప్తంగా రాగి గనుల ఉత్పత్తి దాదాపు 1 శాతం తగ్గగా, కాన్సన్‌ట్రేట్ ఉత్పత్తి 2.6 శాతం క్షీణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలా ఒకవైపు తగ్గుతున్న ఉత్పత్తి, మరోవైపు పెరుగుతున్న డిమాండ్, దానికి తోడు టారిఫ్ భయాలు.. అన్నీ కలిసి రాగి ధరలను రికార్డు స్థాయికి చేర్చాయి.