అసెంబ్లీ ఆవరణలో కుప్పకూలిన అధికారి.. సీపీఆర్‌ చేసిన ప్రాణాలు కాపాడిన మంత్రి శ్రీహరి

అసెంబ్లీ ఆవరణలో కుప్పకూలిన అధికారి.. సీపీఆర్‌ చేసిన ప్రాణాలు కాపాడిన మంత్రి శ్రీహరి

Minister Srihari saves official life by performing CPR in Assembly premises
  • అసెంబ్లీ ఆవరణలో కుప్పకూలిన పీఎస్‌ రాజు
  • వెంటనే స్పందించిన మంత్రి వాకిటి శ్రీహరి
  • రాజుకు సీపీఆర్‌ చేసిన మంత్రి
  • వైద్య సిబ్బందిని వెంటనే పిలిపించిన వైనం
  • అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మంత్రి వాకిటి శ్రీహరి మానవత్వం చాటుకున్నారు. నవీన్‌ మిట్టల్‌ పీఎస్‌ రాజు అకస్మాత్తుగా అక్కడే కుప్పకూలడంతో మంత్రి వెంటనే స్పందించారు. ఆయనకు సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు.

అనంతరం వైద్య సిబ్బందిని పిలిపించిన మంత్రి.. రాజుకు వెంటనే వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. అంబులెన్స్‌ రప్పించి బాధితుడిని ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అసెంబ్లీ ఆవరణలో రాజు కుప్పకూలిన వెంటనే మంత్రి శ్రీహరి స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో వెంటనే స్పందించి సీపీఆర్‌ చేయడాన్ని అభినందిస్తున్నారు.
Advertisement
Vakiti Srihari
Telangana Assembly
Minister performs CPR
PS Raju
Life saving act
Telangana Minister viral video

More Telugu News