ఈజిప్టులో 4,000 ఏళ్ల నాటి సమాధి వెలుగులోకి!
- సక్కారాలో 4 వేల ఏళ్ల నాటి పురాతన సమాధి గుర్తింపు
- ఐదో రాజవంశం కాలం నాటి ఉన్నతాధికారి యున్మిన్‌కు చెందినదిగా నిర్ధారణ
- సమాధి గోడలపై వ్యవసాయ పనులు, ఉత్సవాలను చిత్రించిన అద్భుత శిల్పాలు
- ఈ ఆవిష్కరణతో ఆ కాలంనాటి చరిత్రపై కొత్త సమాచారం లభ్యం
- ఈజిప్ట్-స్పానిష్ పురావస్తు బృందం సంయుక్తంగా తవ్వకాలు
చరిత్రకు నిలువుటద్దంలా నిలిచే ఈజిప్టులో మరో అద్భుతమైన పురావస్తు ఆవిష్కరణ వెలుగుచూసింది. సుమారు 4,000 ఏళ్ల క్రితం నాటి ఒక పురాతన సమాధిని పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. కైరోకు పశ్చిమాన గీజా ప్రావిన్స్‌లోని సక్కారాలో ఉన్న మారియెట్ శ్మశానవాటికలో ఈ సమాధి బయటపడింది. ఇది ప్రాచీన ఈజిప్టును పాలించిన ఐదో రాజవంశం (క్రీ.పూ. 2494-2345) చివరి కాలానికి చెందినదని అధికారులు ప్రకటించారు.
ఈజిప్టు-స్పానిష్ పురావస్తు బృందం సంయుక్తంగా జరిపిన తవ్వకాల్లో ఈ సమాధి బయటపడింది. ఇది ఐదో రాజవంశానికి చెందిన ప్రభువు జెడ్కరే ఇసేసి పాలన కాలం నాటిదని పరిశోధకులు నిర్ధారించారు. ఈ సమాధిలో రెండు ప్రార్థనా మందిరాలు (చాపెల్స్) ఉన్నాయి. ఒకటి యున్మిన్ అనే ఉన్నతాధికారికి చెందింది. ఆయన ఆ కాలంలో న్యాయమూర్తిగా, కోర్టు డైరెక్టర్‌గా, ఫిర్యాదులను స్వీకరించే ప్రధాన లేఖకుడిగా పనిచేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.
యున్మిన్ చాపెల్ గోడలపై అద్భుతమైన ఉబ్బెత్తు శిల్పాలు ఉన్నాయి. వీటిపై వ్యవసాయ పనుల దృశ్యాలు, సమాధికి నైవేద్యాలు సమర్పిస్తున్న ఊరేగింపులను ఎంతో నాణ్యతతో చిత్రించారు. రెండో చాపెల్ యున్మిన్ తండ్రి ఇటీకి చెందినది. ఆయన కూడా వ్యవసాయ భూములు, నైవేద్యాల నిర్వహణ చూసే లేఖకుడిగా పనిచేసేవారు. ఈ గదిలో రంగులతో కూడిన అలంకరణలు ఉన్నప్పటికీ, కాలక్రమేణా చాలా వరకు వెలిసిపోయాయి.
ఈ ఆవిష్కరణపై సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యాంటిక్విటీస్ సెక్రటరీ జనరల్ హిషమ్ ఎల్-లీథీ మాట్లాడుతూ.. ఐదో రాజవంశం చివరి కాలం నాటి సక్కారా శ్మశానవాటిక గురించి, ఆ కాలపు వాస్తు, కళా శైలుల గురించి ఈ సమాధి కొత్త పురావస్తు సమాచారాన్ని అందిస్తుందని వివరించారు. కాగా, గత జులైలో లక్సర్‌లోని పశ్చిమ ఒడ్డున ఫారోల కాలం నాటి మరో సమాధిని కనుగొన్నట్లు ఈజిప్ట్ పురావస్తు శాఖ ప్రకటించింది.