పార్టీ ఆఫీస్‌పై చంద్రబాబు ప్రశంసలు.. వర్కింగ్ ప్రెసిడెంట్‌కు అభినందన

పార్టీ ఆఫీస్‌పై చంద్రబాబు ప్రశంసలు.. వర్కింగ్ ప్రెసిడెంట్‌కు అభినందన

Chandrababu Naidu applauds TDP office for solar energy production
  • విద్యుత్ స్వయం సమృద్ధి దిశగా టీడీపీ కేంద్ర కార్యాలయం
  • సోలార్ ప్యానళ్ల ద్వారా 800 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి
  • క్యాంపస్‌లోనే ఒక మెగావాట్ ఉత్పత్తికి అవకాశం ఉందని వెల్లడి
  • పర్యావరణ హితమైన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సంతృప్తి
  • ఏర్పాట్లకు కృషి చేసిన లోకేశ్ ను అభినందించిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం విద్యుత్ విషయంలో పూర్తి స్వయం సమృద్ధి సాధించే దిశగా పయనిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పార్టీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పాల్గొన్న ఆయన, పార్టీ కార్యాలయంలో చేపట్టిన పర్యావరణ హితమైన ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయం ఆదర్శప్రాయంగా ఉందని, ఇక్కడి వాతావరణం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "టీడీపీ కార్యాలయానికి అవసరమైన కరెంటును మనమే ఉత్పత్తి చేసుకునేందుకు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేశాం. మనకు 1000 కిలోవాట్ల విద్యుత్ అవసరం ఉండగా, ఇప్పటికే 800 కిలోవాట్లు ఇక్కడే ఉత్పత్తి అవుతోంది. భవిష్యత్తులో ఈ క్యాంపస్‌లోనే ఒక మెగావాట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉంది" అని వివరించారు. 

కేవలం విద్యుత్‌కే పరిమితం కాకుండా, భూగర్భ జలాలను సమర్థవంతంగా కూడా వినియోగించుకోవాలని, ఆహార వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువు తయారు చేసి ప్రాంగణంలోని చెట్లకు వినియోగించాలని సూచించారు.

పార్టీ కేంద్ర కార్యాలయం, పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండటంపై సంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు, "ఇలాంటి వాతావరణం అంటే అందరికీ ఇష్టమే. ఈ సందర్భంగా మన వర్కింగ్ ప్రెసిడెంట్‌ను (నారా లోకేశ్ ను) అభినందిస్తున్నాను" అని అన్నారు. ప్రస్తుతం పార్టీలో మంచి వాతావరణంలో శిక్షణా తరగతులు జరుగుతున్నాయని, ఈ స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.
Advertisement
Chandrababu Naidu
TDP Central Office
Solar Power Self Sufficiency
Amaravati TDP Headquarters
Renewable Energy Andhra Pradesh
TDP Leadership Conclave

More Telugu News