ఎమ్మెల్యేలను అడ్డుకోవద్దు.. పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
- అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను అడ్డుకోవద్దని పోలీసులకు ఆదేశం
- నిబంధనల ఉల్లంఘనపై స్పీకర్ చర్యలు తీసుకుంటారని స్పష్టీకరణ
- మహిళా ఎమ్మెల్యేలపై దాడి ఘటనపై విచారణ జరపాలని ఉత్తర్వులు
- బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని డీజీపీకి సూచన
తెలంగాణ శాసనసభకు వెళ్లే ఎమ్మెల్యేలను అడ్డుకోవద్దని రాష్ట్ర పోలీసులను హైకోర్టు సోమవారం ఆదేశించింది. శాసనసభ్యులు ఏవైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ వ్యవహారాన్ని స్పీకర్ చూసుకుంటారని, పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అసెంబ్లీ సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం, ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉదంతంపై రాష్ట్ర హోం శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణలో భాగంగా, మహిళా ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులను గుర్తించాలని ఆదేశించింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను సమర్పించాలని డీజీపీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఉదయం అసెంబ్లీ వద్ద జరిగిన పరిణామాల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.