ఆఫ్రికాలో ‘పురుషాంగాల దొంగలు’.. మూఢనమ్మకంతో 80 మంది దారుణ హత్య!
- ఆఫ్రికా దేశాలను పట్టి పీడిస్తున్న వింత మూఢనమ్మకం
- చేయి వేస్తే పురుషాంగం మాయమవుతుందనే భయం
- 'పురుషాంగాల దొంగలు' నెపంతో అమాయకులపై దాడులు
- సోషల్ మీడియా వదంతులతో 80 మందికి పైగా హత్య
- ఆరు వారాల్లోనే 55 మందిని పొట్టన పెట్టుకున్న వైనం
భయం, మూఢనమ్మకం కలిస్తే ఎంతటి ఘోరానికైనా దారితీస్తుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఆఫ్రికాలోని పలు దేశాల్లో జరుగుతున్న అమానవీయ ఘటనలు. కేవలం ఓ అపోహ కారణంగా అమాయకులను 'పురుషాంగాల దొంగలు'గా ముద్రవేసి, మూకదాడుల్లో కిరాతకంగా చంపేస్తున్నారు. ఈ దారుణాలకు సోషల్ మీడియా కూడా తోడవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది.
వేల ఏళ్లుగా ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఓ వింత నమ్మకం ఉంది. కొందరు వ్యక్తులు పురుషుల భుజంపై చేయి వేస్తే వారి పురుషాంగం కుచించుకుపోతుందని లేదా పూర్తిగా మాయమవుతుందని బలంగా విశ్వసిస్తారు. ఈ నమ్మకం కాలానుగుణంగా అప్పుడప్పుడు విజృంభించి, మళ్లీ కొంతకాలానికి సద్దుమణుగుతుంది. కానీ, ఈ మధ్యలో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతారు. గత ఏడాది కాంగోలో మళ్లీ మొదలైన ఈ వదంతులు, సోషల్ మీడియా ప్రభావంతో ఆఫ్రికా ఖండంలోని జాంబియా, మలావీ, బురుండి, మొజాంబిక్, టాంజానియా, కెన్యా వంటి పలు దేశాలకు వేగంగా వ్యాపించాయి.
సోషల్ మీడియాతో పెరిగిన హింస
గతంలో ఇలాంటి వదంతులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉండేవి. కానీ ఈసారి సోషల్ మీడియా కారణంగా పరిస్థితి చేయి దాటిపోయింది. వ్యూస్, లైకుల కోసం కొందరు కంటెంట్ క్రియేటర్లు "అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, మీ పురుషాంగాన్ని కాపాడుకోండి" అంటూ రెచ్చగొట్టే వీడియోలు చేయడంతో భయాందోళనలు మరింత పెరిగాయి. ఫలితంగా, నిరుడు అక్టోబరు నుంచి ఈ ఏడాది జులై మధ్య కాలంలో ఆరు దేశాల్లో 80 మందికి పైగా అమాయకులను 'పురుషాంగాల దొంగలు' అనే నెపంతో ప్రజలు హత్య చేశారు. ఒక్క మొజాంబిక్ దేశంలోనే కేవలం ఆరు వారాల వ్యవధిలో 55 మందిని పొట్టనపెట్టుకున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మృతుల్లో ఒక పోలీసు అధికారి, ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. వీరిలో కొందరిని కర్రలతో కొట్టి చంపగా, మరికొందరిని ఉరితీశారు, ఇంకొందరిని సజీవ దహనం చేశారు.
రద్దీ ప్రదేశాల్లో దాడులు
జనసమర్థం ఎక్కువగా ఉండే మార్కెట్లు, సంతల్లో ఈ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎవరో ఒకరు ఉన్నట్టుండి పక్కనున్న వ్యక్తిని చూపిస్తూ "ఇతను నా పురుషాంగాన్ని మాయం చేశాడు, దొంగిలించాడు" అంటూ గట్టిగా అరవడం మొదలుపెడతారు. ఏం జరిగిందో తెలియక నిందితుడిగా మారిన వ్యక్తి బిత్తరపోయి, తనకేమీ తెలియదని ఎంత చెప్పినా ప్రయోజనం ఉండటం లేదు. ఆరోపణలు చేసిన వ్యక్తి మాటలనే నమ్మిన చుట్టూ ఉన్న జనం, రెండో వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి చేసి ప్రాణాలు తీస్తున్నారు. 2008లో కాంగో రాజధాని కిన్షాసాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుని సద్దుమణిగింది. కానీ, సాంకేతికత పెరిగిన ఈ యుగంలో సోషల్ మీడియా అనే ఆయుధం తోడవడంతో ఈ మూఢనమ్మకం మరింత ప్రమాదకరంగా మారి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటోంది.