కాంగ్రెస్ పార్టీలో కలకలం.. మాజీ ఎమ్మెల్యే సహా 18 మందికి నోటీసులు
- తెలంగాణ కాంగ్రెస్‌లో 18 మంది నేతలకు షోకాజ్ నోటీసులు
- పార్టీ సమావేశాల్లో గొడవలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలు
- మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సహా పలువురు ముఖ్య నేతలకు నోటీసులు
- వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కమిటీ ఆదేశం
తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడిన నేతలపై పార్టీ అధిష్ఠానం కఠిన చర్యలకు సిద్ధమైంది. పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన 18 మంది నాయకులకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆదివారం గాంధీభవన్‌లో కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. నోటీసులు అందుకున్న నేతలు వారం రోజుల్లోగా తమ వివరణ సమర్పించాలని కమిటీ ఆదేశించింది.
ఆదిలాబాద్, గజ్వేల్, సిరిసిల్ల, కరీంనగర్ నియోజకవర్గాల్లో ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో జరిగిన వివాదాలు, ఇతర అవాంఛనీయ ఘటనలపై అందిన ఫిర్యాదులను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ చర్యలు చేపట్టింది. నోటీసులు అందుకున్న వారిలో గజ్వేల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జూపల్లి మల్లారెడ్డి వంటి కీలక నేతలు ఉన్నారు. వీరితో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కంది శ్రీనివాస్ రెడ్డి, సంజీవరెడ్డిలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి.
పెద్దపల్లి ఎంపీ వంశీ కారుపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఆరుగురిపై, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు సింగితం శ్రీనివాస్ అందజేసిన ఫిర్యాదు మేరకు మరో ఏడుగురిపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. కరీంనగర్‌కు చెందిన మూల లక్ష్మికి కూడా నోటీసు జారీ చేశారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. పార్టీ నియమావళిని తాను ఎన్నడూ ఉల్లంఘించలేదని, ఎవరిపైనా కక్ష సాధింపు ధోరణితో నివేదికలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. కేవలం పార్టీలో క్రమశిక్షణను కాపాడటంలో భాగంగానే ఈ నోటీసులు జారీ చేసినట్లు ఆయన వివరించారు.