ఈజిప్టులో భారీ డ్రగ్స్ కేసు.. 12 మందికి ఉరి, 9 మందికి జీవిత ఖైదు
- శిక్ష పడిన వారిలో ప్రముఖ టీవీ క్రైమ్ షో యాంకర్ సారా ఖలీఫా
- ముడి పదార్థాలతో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసుల అభియోగాలు
- ఇదే కేసులో మరో 9 మందికి జీవిత ఖైదు, ఏడుగురి విడుదల
ఈజిప్టులో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో కైరో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఓ ప్రముఖ టీవీ క్రైమ్ షో వ్యాఖ్యాత సహా మొత్తం 12 మందికి మరణశిక్ష విధించింది. ఇదే కేసులో మరో తొమ్మిది మందికి జీవిత ఖైదు విధించగా, సరైన ఆధారాలు లేని కారణంగా ఏడుగురిని నిర్దోషులుగా పరిగణిస్తూ విడుదల చేసింది.
కేసు వివరాల్లోకి వెళితే.. ఓ ముఠా ముడి పదార్థాలను దిగుమతి చేసుకుని అక్రమంగా మాదకద్రవ్యాలను తయారు చేస్తోందని పోలీసులకు సమాచారం అందింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టిన అధికారులు, సదరు నిందితుల వద్ద అక్రమ ఆయుధాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ అభియోగాలు కోర్టులో నిరూపితం కావడంతో న్యాయస్థానం వారిని దోషులుగా నిర్ధారించింది.
మరణశిక్షకు గురైన వారిలో 'మిషన్ ఇంపాజిబుల్' అనే క్రైమ్ షో ద్వారా గుర్తింపు పొందిన ప్రముఖ టీవీ వ్యాఖ్యాత సారా ఖలీఫా (39) కూడా ఉండటం గమనార్హం. నేర వార్తలను విశ్లేషించే ఆమెకే ఇటువంటి శిక్ష పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి గత నెలలోనే కోర్టు ఈ తీర్పును వెలువరించినప్పటికీ, ఈజిప్టు చట్టాల ప్రకారం మత పెద్దల అభిప్రాయాన్ని తీసుకున్న అనంతరం తాజాగా శిక్షలను అధికారికంగా ఖరారు చేశారు.