పవన్ కల్యాణ్ చొరవతో రంగంలోకి మద్రాస్ ఐఐటీ బృందం
- ఉప్పాడ తీర రక్షణ గోడ నిర్మాణానికి సర్వే పనులు ప్రారంభం
- డిజైన్, డీపీఆర్ రూపకల్పన కోసం రంగంలోకి ఐఐటీ మద్రాస్ నిపుణులు
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో కదులుతున్న పనులు
- అత్యాధునిక టెక్నాలజీతో తీరప్రాంతంపై సమగ్ర అధ్యయనం
- దశాబ్దాల సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు
దశాబ్దాలుగా సముద్ర కోతతో విలవిలలాడుతున్న పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీరప్రాంత వాసుల చిరకాల స్వప్నం సాకారం దిశగా కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి. ఈ ప్రాజెక్టు డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పన కోసం ప్రతిష్ఠాత్మక ఐఐటీ-మద్రాస్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది.
గత వారం రోజులుగా ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఐదుగురు సభ్యుల నిపుణుల బృందం ఉప్పాడ తీరంలో క్షేత్రస్థాయి సర్వేను ప్రారంభించింది. అత్యాధునిక డ్రోన్లు, బీచ్ ప్రొఫైలింగ్, ట్రింబుల్ ఆర్980 జీఎన్‌ఎస్‌ఎస్ ఆర్‌టీకే వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తీరం వెంబడి సమగ్ర అధ్యయనం చేస్తున్నారు. సముద్ర గర్భంలోనూ, తీరం పొడవునా భౌగోళిక పరిస్థితులు, అలల తీవ్రత, సముద్ర ప్రవాహాల దిశ, కోతకు గల కారణాలను శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నారు. ఇందులో భాగంగా సముద్రపు లోతును కొలిచే బాతిమెట్రిక్ సర్వేతో పాటు, తీరంలోని ఇసుక, మట్టి నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నారు.
గత 40 ఏళ్లుగా ఉప్పాడ తీరంలో సముద్ర కోత కారణంగా వందల ఎకరాల భూమి, కొన్ని గ్రామాలు సముద్రంలో కలిసిపోయాయి. ఎందరో మత్స్యకారులు, రైతులు సర్వం కోల్పోయి నిర్వాసితులుగా మారారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నడుం బిగించిన పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.323 కోట్ల జాతీయ విపత్తు నిర్వహణ నిధిని సాధించారు.
ఈ ప్రాజెక్టు పనులను పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. డిజైన్, డీపీఆర్ రూపకల్పనతో పాటు సమాంతరంగా పర్యావరణ అనుమతుల ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. త్వరలో పిఠాపురం పర్యటన సందర్భంగా ఐఐటీ నిపుణులతో సమావేశమై పనుల పురోగతిని సమీక్షించనున్నారు. ఈ సర్వే పూర్తయిన తర్వాత ఐఐటీ మద్రాస్ ఇచ్చే నివేదిక ఆధారంగా రక్షణ గోడ డిజైన్‌ను ఖరారు చేసి, నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.