అసెంబ్లీ సమావేశాల తర్వాత రోడ్డెక్కనున్న కేసీఆర్.. భారీ ప్రజా ఉద్యమానికి పిలుపు
- కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కేసీఆర్ భారీ ఉద్యమం
- కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులపై నిర్లక్ష్యమే ప్రధాన కారణమన్న హరీశ్ రావు
- సీఎం రేవంత్ భాష వల్లే కేసీఆర్ సభకు రావట్లేదన్న వెల్లడి
- అసెంబ్లీ లోపల, బయట సర్కారును నిలదీయాలని బీఆర్ఎస్ నిర్ణయం
- ముందు రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. సోమవారం ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల తర్వాత, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా భారీ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించనున్నారని పార్టీ ప్రకటించింది.
ఆదివారం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం వివరాలను అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మీడియాకు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నీటిని ఎత్తిపోయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం 80 శాతం పూర్తి చేసిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మిగిలిన పనులు పూర్తిచేస్తే 60 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందని, కానీ కాంగ్రెస్ సర్కారు కక్షపూరితంగా దాన్ని పక్కనపెట్టిందని విమర్శించారు.
"ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా, రాబోయే రోజుల్లో స్వయంగా కేసీఆర్ లక్షలాది మందితో ప్రత్యక్ష ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించాం" అని హరీశ్ రావు తెలిపారు.
అసెంబ్లీలోనూ ప్రభుత్వాన్ని పలు అంశాలపై నిలదీస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు. సెక్షన్ 22ఏ కింద భూములను 'నిషేధిత జాబితా'లో చేర్చి రైతులను వేధించడం, విద్యుత్ కోతలు, రుణమాఫీ వైఫల్యం, పాలిటెక్నిక్ జీవో 97 రద్దు, సింగరేణి కుంభకోణాలు, పీఆర్సీ, డీఏలు, ఈహెచ్‌ఎస్ అమలులో వైఫల్యాలపై ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తామన్నారు.
అసెంబ్లీకి కేసీఆర్ హాజరుకాకపోవడంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను హరీశ్ రావు తిప్పికొట్టారు. "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడే వీధి స్థాయి భాషను వినడానికి కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఎన్టీఆర్, జయలలిత, చంద్రబాబు వంటి నేతలు శాసనసభలో అవమానాలకు గురైనప్పుడు సభను బహిష్కరించి, ప్రజా తీర్పుతో తిరిగి ముఖ్యమంత్రులుగా వచ్చారని, కేసీఆర్ కూడా అదే మార్గంలో పయనిస్తున్నారని అన్నారు.
ప్రతిపక్ష నేత భద్రత ఖర్చుపై మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డి, కనీసం వార్డు మెంబర్‌గా కూడా లేని తన సోదరుడు తిరుపతి రెడ్డికి నలుగురు గన్‌మెన్లను పెట్టి రూ.40 కోట్లు ఖర్చు చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశాన్ని కూడా సభలో ప్రస్తావిస్తామన్నారు. ప్రజా సమస్యలపై సమగ్ర చర్చకు వీలుగా అసెంబ్లీ సమావేశాలను నెల రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్‌పై స్పందిస్తూ.. 'ఆరు గ్యారెంటీలు', రుణమాఫీ హామీని నిలబెట్టుకోనందుకు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. పాలన చేతగాక, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుండటంతోనే.. కేసీఆర్ రాజీనామా అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్నా.. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, దళిత, గిరిజన, బీసీ వర్గాలను దారుణంగా మోసం చేసిందని విమర్శించారు.