బిగ్‌బాస్ సీజన్ 10: అట్టహాసంగా ప్రారంభం.. చరిత్రలో తొలిసారి అరుదైన ఘట్టం!
- ఘనంగా ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10
- చరిత్రలో తొలిసారి ఒకేసారి మొదలైన దక్షిణాది బిగ్‌బాస్ షోలు
- హౌస్‌లోకి తొలి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన నటి దేబ్జానీ మోదక్
- 'కీ' చాలా కీలకం అంటూ ఉత్కంఠ రేపిన హోస్ట్ నాగార్జున
- ఒకే స్క్రీన్‌పై నాగార్జున, మోహన్‌లాల్, సుదీప్, విజయ్ సేతుపతి
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్‌బాస్' పదో సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. హోస్ట్ అక్కినేని నాగార్జున గ్రాండ్ ఎంట్రీతో ఈ షోకు ఘనంగా తెరలేచింది. స్టార్ మా ఛానెల్‌తో పాటు జియోహాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న ఈ లాంఛ్ ఈవెంట్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రోమోలు, కొత్త హౌస్ డిజైన్‌తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచిన ఈ సీజన్, ఊహించని సర్ ప్రైజ్‌లతో మొదలైంది.
ఈసారి బిగ్‌బాస్ లాంఛ్ ఓ అరుదైన ఘట్టానికి వేదికైంది. బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారిగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో షోలు ఒకేసారి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయా భాషల హోస్టులు నాగార్జున, మోహన్‌లాల్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి ఒకే స్క్రీన్‌పై కనిపించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది దక్షిణాది బుల్లితెరపై ఒక కొత్త అధ్యాయంగా చెప్పుకోవచ్చు.
ఇక హౌస్‌లోకి అడుగుపెట్టిన తొలి కంటెస్టెంట్‌గా నటి దేబ్జానీ మోదక్ నిలిచారు. 'ఛాంపియన్' సినిమాలోని "గిర్ర గిర్ర గిర్ర గింగిరానివే" పాటకు పవర్‌ఫుల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. రెండో కంటెస్టెంట్ గా నటుడు త్రిగుణ్ ఎంట్రీ ఇచ్చారు.
అంతకుముందు, హోస్ట్ నాగార్జున స్వయంగా హౌస్‌లోకి వెళ్లి ఓ మ్యాజిక్ కీ గురించి వివరించారు. ఈసారి ఈ 'కీ' చాలా కీలకం కానుందని, అది కంటెస్టెంట్ల తలరాతను మార్చేస్తుందని చెప్పి మొదటి రోజు నుంచే ఉత్కంఠను పెంచారు. రోబో ఎంట్రీతో వైరల్ అయిన కొత్త హౌస్ డిజైన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.