ఎస్‌బీఐ భారీ విస్తరణ.. 12,000 కొత్త ఉద్యోగాలు, 250 కొత్త బ్రాంచ్‌లు
- ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉద్యోగుల నియామకానికి ఎస్‌బీఐ ప్లాన్
- క్లరికల్, ఆఫీసర్ కేడర్లలో ఉద్యోగాల భర్తీ
- దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో కొత్త బ్రాంచ్‌ల ఏర్పాటుకు నిర్ణయం
- వివరాలను వెల్లడించిన ఎస్‌బీఐ ఛైర్మన్ సి.ఎస్. శెట్టి
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు, బ్యాంకింగ్ ఉద్యోగార్థులకు తీపి కబురు అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY27) సుమారు 12,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవడంతో పాటు, దేశవ్యాప్తంగా 250 కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఎస్‌బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు.
ఈ నియామక ప్రక్రియలో భాగంగా క్లరికల్ (జూనియర్ అసోసియేట్), ఆఫీసర్ (ప్రొబేషనరీ ఆఫీసర్) కేడర్లలో దాదాపు 11,000 నుంచి 12,000 మందిని తీసుకోనున్నట్లు ఛైర్మన్ తెలిపారు. ఉద్యోగుల పదవీ విరమణలు, బ్యాంకు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ భర్తీ ప్రక్రియ ఉంటుందని ఆయన వివరించారు.
గతేడాది (2025-26) బ్యాంకు సుమారు 1,500 మంది ఐటీ స్పెషలిస్ట్ ఆఫీసర్లతో సహా మొత్తం 25,633 మందిని నియమించుకుంది. అయితే, ఈసారి ఐటీ రంగంలో అంత పెద్ద సంఖ్యలో నియామకాలు ఉండవని, జనరల్ బ్యాంకింగ్ సిబ్బందికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఒకవైపు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు విస్తరిస్తున్నప్పటికీ, భౌతిక బ్రాంచ్‌ల ప్రాధాన్యాన్ని కూడా బ్యాంకు గుర్తిస్తోందని ఛైర్మన్ అన్నారు. ఇందులో భాగంగా, కొత్తగా అభివృద్ధి చెందుతున్న నివాస, వాణిజ్య ప్రాంతాల్లో ఏటా నికరంగా 200 నుంచి 250 కొత్త శాఖలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
సీఎన్‌బీసీ టీవీ18 కథనం ప్రకారం, కొన్ని పాత బ్రాంచ్‌లను హేతుబద్ధీకరించే ప్రక్రియ కూడా కొనసాగుతుందని తెలుస్తోంది. 2026 మార్చి నాటికి ఎస్‌బీఐలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.45 లక్షలకు పైగా ఉంది. తాజా నియామకాలతో బ్యాంకు తన సేవలను మరింత విస్తృతం చేయాలని భావిస్తోంది.