కేటీఆర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. కారును ఢీకొట్టిన లారీ

KT Rama Rao Narrow Escape After Truck Hits Car
  • కేటీఆర్ కరీంనగర్ పర్యటనలో ప్రమాదం
  • ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన లారీ
  • ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ కేటీఆర్
  • గతంలోనూ పలుమార్లు ఆయన కాన్వాయ్‌లో ఇలాంటి ఘటనలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తృటిలో రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. కరీంనగర్‌కు వెళుతుండగా శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న కారు పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, కేటీఆర్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కరీంనగర్‌లో నిర్వహించ తలపెట్టిన విద్యార్థి, యువజన సదస్సులో పాల్గొనేందుకు కేటీఆర్ శనివారం బయలుదేరారు. మార్గమధ్యలో అలుగునూరు వద్ద ఆగగా, పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడ కార్యక్రమం ముగించుకుని ప్రయాణం తిరిగి ప్రారంభమైన వెంటనే, కారుకు సమాంతరంగా వెళుతున్న ఒక లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు వెనుక భాగంలోని డోర్ తీవ్రంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో కేటీఆర్ కారులోనే ఉన్నప్పటికీ, ఆయన సురక్షితంగా బయటపడటంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

కేటీఆర్ ప్రయాణాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది జులైలో జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ వద్ద ఆయన కాన్వాయ్‌లోని రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ ప్రమాదంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు గాయాలయ్యాయి.
Advertisement
KT Rama Rao
Karimnagar
Road Accident
BRS Party
Alugunoor
KTR Car Accident

More Telugu News