కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: పొన్నం ప్రభాకర్ డిమాండ్
- వెయ్యి రోజులుగా సభకు రాకుండా జీతం తీసుకుంటున్నారని ఆరోపణ
- కేసీఆర్ వైఖరికి నిరసనగా 6న ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ మహా ధర్నా
- ధర్నాలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను వివరిస్తామన్న మంత్రులు
- సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలు నిర్వర్తించని వ్యక్తి ఆ పదవిలో కొనసాగడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఈ నెల 6న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద 'మహా ధర్నా' నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ ధర్నాకు సంబంధించిన సన్నాహక సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి వందేళ్ల నష్టం వాటిల్లిందని విమర్శించారు. "వెయ్యి రోజులుగా ఎమ్మెల్యేగా వేతనం తీసుకుంటున్న కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, కనీసం తన నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో ఉండటం లేదు. ప్రతిపక్ష నేతగా ఆయన పూర్తిగా విఫలమయ్యారు" అని ఆరోపించారు.
కేసీఆర్ వైఖరిని ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికే ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇదే వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజాపాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు. ఈ మహా ధర్నాను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.