రిజ్వాన్, ఇమామ్‌లపై వేటు వ్యవహారంలో పాక్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ షాకింగ్ కామెంట్స్

  • మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ అలీ అఘాలను తొలగించిన పీసీబీ
  • ఏం జరిగిందో తనకు తెలియదన్న మైక్ హెస్సన్
  • తాను బాధ్యతలు స్వీకరించే సమయానికే వారిని తొలగించారని వెల్లడి

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టులో చోటుచేసుకున్న తీవ్ర పరిణామాలపై ఆ జట్టు హెడ్ కోచ్ మైక్ హెస్సన్ స్పందిస్తూ విస్మయకర వ్యాఖ్యలు చేశారు. లార్డ్స్, హెడింగ్లే టెస్టుల్లో వరుస ఓటముల అనంతరం సీనియర్ ఆటగాళ్లు మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ అలీ అఘాలను హఠాత్తుగా జట్టు నుంచి తొలగించి స్వదేశానికి పంపించివేయడంపై ఆయన మాట్లాడుతూ... దేని గురించి తనకేమీ తెలియదని, తాను జట్టు బాధ్యతలు స్వీకరించే సమయానికే వారిని పంపించే ప్రక్రియ పూర్తయిందని చెప్పడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఆసియా క్రీడల శిక్షణా క్యాంప్ నుంచి బర్మింగ్‌హామ్ చేరుకున్న హెస్సన్ మీడియాతో మాట్లాడుతూ... "చివరి టెస్టుకు నన్ను తాత్కాలిక రెడ్ బాల్ కోచ్‌గా వ్యవహరించమని పీసీబీ కోరిన సమయానికే ఆ ముగ్గురు సీనియర్ ప్లేయర్లు జట్టు నుంచి నిష్క్రమించి స్వదేశం వైపు పయనమయ్యారు. కాబట్టి అక్కడ అసలు ఏం జరిగిందో నాకు నిజంగా తెలియదు" అని పేర్కొన్నారు. మిగిలిన ఆటగాళ్లతో రాబోయే మ్యాచ్‌పై దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

More Telugu News