ద్రవ్యోల్బణం, లిక్విడిటీ ఒత్తిడి.. రెపో రేటు పెంపునకు సిద్ధమవుతున్న ఆర్బీఐ?
- ఏప్రిల్ 2027 నాటికి రెపో రేటును 6 శాతానికి పెంచే అవకాశం
- మార్కెట్లలో పేరుకుపోయిన అదనపు నగదు ప్రవాహంతో విధానపరమైన సవాళ్లు
- పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో ఆర్బీఐపై పెరుగుతున్న ఒత్తిడి
- త్వరలో ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసే దిశగా ఆర్బీఐ అడుగులు
- బంధన్ ఏఎంసీ నివేదికలో వెల్లడైన కీలక ఆర్థిక అంచనాలు
భారత ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును ఏప్రిల్ 2027 నాటికి 6 శాతానికి పెంచే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ బంధన్ ఏఎంసీ తన నివేదికలో అంచనా వేసింది. మార్కెట్లలో పేరుకుపోయిన అదనపు నగదు లభ్యత (లిక్విడిటీ), పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో స్థిరమైన ద్రవ్య విధానాన్ని రూపొందించేందుకు ఈ పెంపు అవసరమని నివేదిక శుక్రవారం స్పష్టం చేసింది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒకవైపు, విదేశీ పెట్టుబడుల రూపంలో భారీగా వస్తున్న రూపాయి నిధుల వల్ల ఏర్పడిన అదనపు లిక్విడిటీ మరోవైపు.. ఈ రెండింటి మధ్య భారత ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఇన్వెస్టర్లు సంక్లిష్టమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారని నివేదిక విశ్లేషించింది. ఈ అదనపు నగదు ప్రవాహం కారణంగా ఓవర్‌నైట్ వడ్డీ రేట్లు, ఆర్బీఐ పాలసీ రేటు కంటే చాలా తక్కువ స్థాయికి పడిపోయాయని తెలిపింది. ఈ అసమతుల్యతను సరిదిద్దడానికి ఆర్బీఐ త్వరలోనే రంగంలోకి దిగాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఆర్బీఐ ఎంత వేగంగా చర్యలు తీసుకుంటుందన్న దానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉందని నివేదిక అభిప్రాయపడింది. ఓవర్‌నైట్ రేట్లను తిరిగి పాలసీ రేట్లతో అనుసంధానించడం, మధ్యకాలికంగా ఉన్న అదనపు లిక్విడిటీని తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని రెపో రేటు పెంపుపై ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకోవడం వంటి చర్యలు ఉంటాయని అంచనా వేసింది. ఎఫ్‌ఎక్స్ స్వాప్స్, ఎంఎస్‌ఎస్ బాండ్లు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) అమ్మకాలు, అవసరమైతే నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్) పెంపు వంటి చర్యలను మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయని తెలిపింది.
మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో ఇంధన ధరలు పెరగడం, వ్యవసాయ ఉత్పత్తులతో సహా ఇతర కమొడిటీల ధరల్లో ఒత్తిడి వంటి అంతర్జాతీయ అంశాలు ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్నాయని నివేదిక గుర్తు చేసింది. దీనికి తోడు, దేశంలో రుతుపవనాలు అస్తవ్యస్తంగా ఉండటం, జీడీపీ వృద్ధి బలంగా నమోదు కావడం, రుణ వృద్ధి సుమారు 18 శాతంగా ఉండటం వంటి స్థానిక పరిస్థితులు కూడా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెంచుతున్నాయని వివరించింది.
ఇప్పటివరకు వెలువడిన గణాంకాలు ఆర్బీఐకి కొంత ఊరటనిచ్చినప్పటికీ, ఇటీవలి ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశపు మినిట్స్.. సభ్యుల వైఖరి కఠినంగా మారుతోందనడానికి సంకేతమని నివేదిక అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా ధరల ఒత్తిళ్లు మరింత తీవ్రమవుతున్న తరుణంలో, ప్రస్తుత పాలసీ వైఖరిపై ఎంపీసీ సభ్యులలో అసౌకర్యం పెరుగుతోందని అంచనా వేసింది.