పెట్టుబడుల వేట.. వ్యక్తిగత అంశాలు: విజయ్ తొలి విదేశీ పర్యటనపై తమిళనాట చర్చ
- సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి విదేశీ పర్యటన
- ఈ నెల 10 నుంచి 16 వరకు బ్రిటన్ లో పర్యటించనున్న విజయ్
- భార్య, కుమార్తెలను విజయ్ కలుస్తాడంటూ ప్రచారం
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ తన తొలి అధికారిక విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రానికి భారీగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన ఈ నెల 10 నుంచి 16 వరకు బ్రిటన్ లో పర్యటించనున్నారు. లండన్‌లో జరిగే పలు కీలక పారిశ్రామికవేత్తల సమావేశాల్లో పాల్గొని ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు.
అయితే, ఈ పర్యటన కేవలం అధికారిక కార్యకలాపాలకే కాకుండా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించింది అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు తొలగిపోయాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో, లండన్‌లో నివసిస్తున్న భార్య సంగీత, కుమార్తె దివ్యలను ఆయన ఈ పర్యటనలో కలుసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు, ఇదే సమయంలో నటి త్రిష కూడా ఓ షూటింగ్ నిమిత్తం యూరప్‌లోనే ఉండటంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి, రాష్ట్రంలో పెట్టుబడులు సాధించే ముఖ్యమైన లక్ష్యంతో పాటు వ్యక్తిగత జీవితపు ప్రాధాన్యతల నడుమ సీఎం విజయ్ తొలి విదేశీ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.